మహిళలపై అత్యాచారయత్నాలకు, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు
1 min readశిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకుంటాo
ఏలూరు డి.ఎస్.పి శ్రావణ్ కుమార్ హెచ్చరిక
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: మహిళలపై అత్యాచారలకు, దాడులకు పాల్పడితే శిక్షలు పడేవిధంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు డి.ఎస్.పి శ్రావణ్ కుమార్ హెచ్చరించారు. ఏలూరు నగరంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఆదివారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ పాల్గొని తెలిపిన వివరాల ప్రకారం చింతలపూడి మండలం ధర్మాజీగూడెం ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల వివాహిత కు భర్త చనిపోయాడు. ఈ క్రమంలో ఆమె ఒంటరిగా జీవిస్తుంది. పెదవేగి మండలం విజయరాయి ప్రాంతానికి చెందిన వ్యక్తితో ఆమెకు పరిచయమైంది. అతను స్థానికంగా కోళ్ల ఫారాల లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. వీరి ఇరువురికి పరిచయం ఏర్పడింది.అతను ఆమెకు రెండో భర్తగా మారాడు. వీరు ఇరువురు కలిసి గత పది రోజుల క్రితం ఏలూరు నగరానికి వచ్చారు. స్థానికంగా ఉన్న హోటల్లో పనిచేస్తూ జీవనని సాగిస్తున్నారు. ప్రస్తుతం వీరికి అద్దెకు ఇల్లు దొరక్కకపోవడంతో ఒకటో పట్టణ పరిధిలోని ఓ గుడి కి చెందిన ఖాళీ ప్రదేశంలో రాత్రిపూట తలదాచుకుంటున్నారు.ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సమయంలో టీచర్స్ కాలనీకి చెందిన నూతిపల్లి పవన్, లంబాడి పేటకు చెందిన నారపాటి నాగేంద్రబాబు, విజయ్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు వీరు వద్దకు వచ్చి మీరు ఎవరని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తమ వద్ద మద్యం ఉందని తాగుదామని అడగడంతో మహిళతో సహా ఐదుగురు కలిసి మద్యం సేవించారు. కొద్దిసేపటికి భర్త నిద్రకు ఉపక్రమించాడు. అనంతరంఆమెను పక్కనే ఉన్న సందులోకి తీసుకుని వెళ్లి తమ కోరిక తీర్చాలని అత్యాచారయత్నానికి పాల్పడడంతో మహిళ కేకలు వేసింది. ఆటగా వెళుతున్న వ్యక్తి ఇది గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలని వైద్య పరీక్షలు నిమిత్తం ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఈ ఘటనపై ఒకటో పట్టణ ఎస్ఐ లక్ష్మణ్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు. ఘటనకు పాల్పడిన పవన్, నాగేంద్రబాబు, విజయ కుమారులను గంటల వ్యవధిలో ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు . శనివారం రాత్రి వారిని రిమైండ్ కి తరలించారు.ఈ సందర్భంగా డిఎస్పి శ్రావణ్ మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మహిళలపై అగత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళ ఆపదలో ఉందని అపరిచిత వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 15 నిమిషాల వ్యవధిలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితురాలని వైద్య పరీక్షలు నిమిత్తం ఆసుపత్రికి తరలించమని ఆయన తెలిపారు. చిత్తు కాయితాలు వ్యర్థ పదార్థాలు ఎరుకొని వాటిని అమ్ముకుని జీవనం సాగించే ముగ్గురు మహిళ పై అత్య చారి యత్నానికి పాల్పడటంతో వారిని గంటల వ్యవధిలో అరెస్టు చేశామని ఆయన అన్నారు. నగరంలో ఉన్న ప్రతి ఒక్కరిపై నిగా ఏర్పాటు చేస్తున్నామని అపరిచిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నమని అన్నారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే ఒకటో పట్టణ పోలీసులతోపాటు రెండో పట్టణ ఎస్సై సాదిక్ కూడా ఘటన స్థలానికి చేరుకున్నారని తెలియజేశారు. బాధితులకు కచ్చితంగా న్యాయం జరిగేలా నిందితులకు శిక్షలు పడేలా చర్యలు చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఒకటో పట్టణ సిఐ రాజశేఖర్, ఎస్ఐలు లక్ష్మణ్ బాబు, నవీన్ కుమార్ పాల్గొన్నారు.