చిన్నారులతో భిక్షాటన చేయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు
1 min readబాలలతో భిక్షాటన చేయిస్తూన్న వారి సమాచారం జిల్లా బాలల సంరక్షణ అధికారికి, దగ్గరలో పోలీసు స్టేషన్ కి సమాచారం అందించాలి
డా:సి హెచ్ సూర్య చక్రవేణి బాలల సంరక్షణ అధికారి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా లో స్థానిక ఆర్ఆర్ పేట, పత్తేబాద్ లో నెలల వయస్సు కలిగిన బాలునితో భిక్షాటన చేస్తున్న తల్లిని చైల్డ్ హెల్క్ప్ లైన్-1098 సిబ్బంది ద్వారా గుర్తించి డిసిపియూ కార్యాలయానికి తీసుకుని వచ్చి కౌన్సెల్లింగ్ మంగళవారం నిర్వహించడం జరిగింది.. వీరు పెదవేగి మండలం సూర్యపేట గ్రామానికి చెందిన వారని, భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తునారు అని, ఇది వారి కుల వృత్తిగా భావిస్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకమైన పని అని ఇలాగే కొనసాగితే చట్టపరంగా చర్యలు చేపతామని,అలాగే ఎవరైనా చిన్నారులతో భిక్షాటన చేయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా బాలలు భిక్షాటన చేస్తే వారికి నగదు బదులు, వారికి కావల్సిన ఆహారం, వస్తువులు లేదా వసతి కల్పించడానికి ప్రయత్నించాలని, భిక్షాటన లేని జిల్లాగా తీర్చిదిడటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి ల, పిల్లలందరూ బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇకనుండి ఎవరైనా రోడ్ల మీదకు అడుక్కోవటానికి వస్తే కేసులు బుక్ చేసి ఎఫ్ ఐ ఆర్ చేయించి రిమాండుకు పంపిస్తామని హెచ్చరించడమైనది.