తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు
1 min readనగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వేసవికాలం సమీపిస్తున్న దృష్ట్యా నగరంలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు వెల్లడించారు. ఆదివారం ఆయన అశోక్ నగర్‌లోని నీటి శుద్ధి కేంద్రాన్ని కమిషనర్ పరిశీలించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అవసరమైన చర్యలను ముమ్మరం చేయాలని, ఒకవేళ ఏర్పడినా తక్షణ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. పైప్‌లైన్ లీకేజీలకు ఆస్కారం లేకుండా, సిబ్బందితో ముందుగానీ గుర్తించి తగిన మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం శుద్ది కేంద్రంలోని మొక్కల నర్సరీని కమిషనర్ పరిశీలించారు. కార్యక్రమంలో డిఈఈలు శ్రీనివాస రెడ్డి, నరేష్, ఏఈలు ఇ.ప్రవీణ్ కుమార్ రెడ్డి, నాగజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.