PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

16  స్ట్రాంగ్ రూమ్ ల వద్ద స్ట్రాంగ్ సెక్యూరిటి … జిల్లా ఎస్పీ

1 min read

స్ట్రాంగ్ రూమ్ ల   సిసికెమెరాల కమాండ్ కంట్రోల్ ను  పరిశీలించిన… జిల్లా ఎస్పీ

పలెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు రాయలసీమ యూనివర్సీటిలో 3 బ్లాకులలో , 16 స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఏర్పాటు  చేసిన మూడంచెల భద్రత ను  కర్నూలు జిల్లా ఎస్పీ  జి. కృష్ణకాంత్ ఐపియస్  బుధవారం పరిశీలించారు.  అనంతరం   అక్కడ ఏర్పాటు చేసిన  సిసి కెమెరాల కమాండ్ కంట్రోల్ ను పరిశీలించారు.  స్ట్రాంగ్ రూమ్ ల యొక్క మూడంచెల భద్రతలో  మొదటి స్థాయిలో కేంద్ర సాయుధ బలగాలు,  రెండవ స్ధాయిలో  ఆర్మడు రిజర్వుడు  బలగాలు ,  తృతీయ స్ధాయిలో  సివిల్ పోలీసు బలగాలను మోహరింపచేశాము.స్ట్రాంగ్ రూమ్ ల వద్ద 144 సెక్షన్  అమలులో ఉంది. ప్రతి స్ట్రాంగ్ రూమ్ , పరిసరాలలో  సిసిటివి కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచాము.ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద  కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో గస్తీ ఏర్పాటు చేశాము. స్ట్రాంగ్ రూమ్ లకు   ఉన్నత స్ధాయి అధికారులను ఇంచార్జీలుగా నియమించాము. ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ ఇంజన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.   విద్యుత్ అంతరాయం  లేకుండా జనరేటర్ లు కూడా ఏర్పాటు చేశాం .  ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే  చట్టపరమైన చర్యలు తీసుకుంటాం .    స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పరిచిన కేంద్రాల ఎంట్రెన్స్ గేట్  లోపలికి , పరిసరాలలోకి  గుర్తింపు కార్డులు లేని వ్యక్తులు లేదా అనధికార వ్యక్తులు , ఇతరుల వాహనాలకు  అనుమతిలేదు.         రాజకీయ పార్టీల అభ్యర్థులు ,  వారి ఏజెంట్లు  ఔటర్ పెరిమీటర్ వరకు మాత్రమే వెళ్ళాలిరిటర్నింగ్ అధికారులు ఇన్నర్ పెరిమిటర్ వరకు వెళ్ళాలి.  స్ట్రాంగ్ రూమ్‌కి ఒకే ప్రవేశ ద్వారం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. గదికి డబుల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేయబడింది.  స్ట్రాంగ్ రూం 24 గంటలూ సాయుధ బలగాల రక్షణలో ఉంటుంది, CCTV కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించబడుతుంది.స్ట్రాంగ్ రూమ్‌లో అమర్చిన CCTV కెమెరాలు  కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (CCC)కి కనెక్ట్ చేయబడ్డాయి. పారదర్శకంగా, అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో  జూన్ 4 న  ఓట్ల లెక్కింపు  జరిగే వరకు  దృశ్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టాము.  స్ట్రాంగ్ రూమ్‌లకు సీసీటీవీ కవరేజీతో సహా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి  గెజిటెడ్ అధికారులతో పాటు,   పోలీసు అధికారులు 24 గంటలూ డ్యూటీలో ఉండే విధంగా చర్యలు చేపట్టాం. EVM స్ట్రాంగ్ రూమ్ లు   సెక్యూరిటీ మరియు కారిడార్ మొదలైన వాటి యొక్క సీల్డ్ వేసిన  డోర్‌లను కవర్ చేసే విధంగా CCTV కవరేజ్/వీడియోగ్రఫీ  ఏర్పాటు చేశాము.  స్ట్రాంగ్ రూమ్ లు తెరిచే ముందు మరియు మూసివేసే సమయంలో CCTV కవరేజ్/వీడియోగ్రఫీ మొత్తం సీలింగ్ ప్రక్రియ స్పష్టంగా కనిపించే విధంగా సిసిటివీలు  ఏర్పాటు చేశాం.CC TV  ఫుటేజీ  డేటా నిల్వ ఉండే CCTV కెమెరాలు అమర్చాము. ప్రతి ఎంట్రీ , ఎగ్జిట్  దగ్గర   విజిట్ చేసిన అధికారులు  రిజిస్టర్ / లాగ్-బుక్‌ లో  సంతకాలు చేసే విధంగా  ఏర్పాటు చేశాము. ఇందులో పరిశీలకులుగా జిల్లా ఎన్నికల అధికారి /  జిల్లా కలెక్టర్  లేదా జిల్లా ఎస్పీ లేదా ఆ పై స్ధాయి అధికారులు ఉంటారు.జిల్లా ఎన్నికల అధికారి నుండి ఎప్పటికప్పుడు  నివేదికను చీఫ్ ఎలక్షన్ కమిషన్ అధికారికి  పంపబడుతుంది. రాజకీయ పార్టీల అభ్యర్దులు, పుకార్లు, అపోహలను నమ్మవద్దు.  తొందరపడకుండా నిర్ధారణకు అవసరమైతే   ఎలక్షన్ కమిషన్ దృష్టి కి తీసుకువెళ్ళాలి.అపోహలు, తప్పుడు సమాచారాలు నమ్మి జిల్లాలో ఎవరైనా  అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే పోలీసు శాఖ తీవ్రంగా పరిగణించి  అటువంటి వారి పై  కఠిన చర్యలు తీసుకుంటాము .  జూన్ 4 న ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది.   అసాంఘిక శక్తులు,  రౌడీ షీటర్ల పై  ప్రత్యేక పోలీసు నిఘా కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ  వెంట కర్నూలు డిఎస్పీ కె. విజయశేఖర్, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సిఐలు నాగరాజు యాదవ్, శ్రీనివాస రెడ్డి, కర్నూలు తాలుకా సిఐ శ్రీధర్, ట్రాఫిక్ సిఐ గౌతమి, ఆర్ ఐలు ఉన్నారు.

About Author