2 వేల మంది పోలీసులతో కౌంటింగ్ కు పటిష్ట భద్రత… కర్నూలు జిల్లా ఎస్పీ
1 min readజూన్ 4 వ తేది రాయలసీమ యూనివర్సీటి కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ .
భారీగా పోలీసు బలగాల మోహరింపు.
ప్రతి చోట సిసి కెమెరాలు ఏర్పాటు చేశాం.
అల్లర్లకు పాల్పడితే గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం.
సిసి కెమెరాలు, బాడీ ఒన్ కెమెరాలతో పోలీసుల ప్రత్యేక నిఘా.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
విజయోత్సవ ర్యాలీలు నిషేధం.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జూన్ 4 న కర్నూలు జిల్లా కేంద్రంలోని రాయలసీమ యూనివర్సీటి లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సంధర్బంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు.కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధం చేశాం.జిల్లాలో శాంతియుతం వాతావరణం కు రాజకీయ పార్టీలు, ప్రజలు, మీడియా సహకరించాలి. ట్రబుల్ మాంగర్స్, రౌడీషటర్ల పై … ప్రత్యేక నిఘా ఉంచాం. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంది. రాయలసీమ యూనివర్సీటి దగ్గర బందోబస్తు వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు , 6 మంది డిఎస్పీలు, 20 మంది సిఐలు, 28 మంది ఎస్సైలు , 84 మంది ఎఎస్సైలు / హెడ్ కానిస్టేబుల్స్, 120 మంది కానిస్టేబుల్స్ , 40 మంది మహిళా కానిస్టేబుల్స్ , 196 మంది హోంగార్డులు, 87 మంది ఎఆర్ పోలీసులు, 2 స్పెషల్ పార్టీలు, కేరళ స్పెషల్ ఆర్మడు పోలీసు బలగాలు రాయలసీమ యూనివర్సీటి దగ్గర బందోబస్తు విధులలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా, కౌంటింగ్ కేంద్రంతో కలుపుకుని , సబ్ డివిజన్ లలో బందోబస్తు వివరాలు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 10 మంది డిస్పీలు, 51 మంది సిఐలు, ముగ్గురు ఆర్ ఐలు, 73 మంది ఎస్సైలు , 9 మంది ఆర్ ఎస్సైలు, 1060 మంది సివిల్ పోలీసులు , 200 మంది ఎఆర్ పోలీసులు , 300 మంది హోంగార్డులు ,జిల్లా పోలీసులతో పాటు ఇతర జిల్లాల పోలీసులతో పాటు, కేంద్ర పోలీసు బలగాలలోని SPF 20 మంది , SAR 24 మంది , కేరళ సిఎ పి ఎఫ్ 1 కంపెనీ, బిఎస్ ఎఫ్ 1 కంపెనీ ఈ బందోబస్తు విధులలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 188 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి 188 పోలీసు పికెట్స్ ను ఏర్పాటు చేశాం.కౌంటింగ్ రోజున ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్టాటిక్ పోలీస్ పికెట్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. 91 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు , పోలీసు రూట్ మొబైల్స్ లతో కౌంటింగ్ కేంద్రం వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేశాము. 57 QRT లను అన్ని సున్నితమైన పికెట్‌లలో సిఐ, ఎస్ఐ నేతృత్వంలో పెట్రోలింగ్ నిర్వహించే విధంగా ఏర్పాటు చేశాం.67 రూట్ మొబైల్ టీమ్ లను , 2 కంట్రోల్ రూములు , 14 బాడి ఒన్ కెమెరాలు, 9 విడియో కెమెరాలు, ఏర్పాటు చేశాం. ఇతర ముఖ్య నేతల కదలికలపై నిఘా ఉంచేందుకు గాను షాడో పార్టీలు, ఎవ్వరైనా సమస్యలు సృష్టిస్తే అటువంటి వారిని గృహ నిర్బంధం చేయుటకు గాను టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగింది.8 టియర్ గ్యాస్ టీమ్‌లు ఏర్పాటు చేశాం. లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎదురైనా తరుణంలో వాటిని పరిష్కరించుటకు గాను ఏర్పాటు చేయడం జరిగింది. 41 ప్రాంతాలను గుర్తించి కౌంటింగ్ రోజున అన్ని పార్టీ కార్యాలయాలు, పోటీ చేసే అభ్యర్థుల ఇళ్ల వద్ద, ముఖ్య నేతల ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశాం. కర్నూలు పట్టణ శివారులలో 8 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా మొత్తం 31 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం.1775 గ్రామ సభలు నిర్వహించి ఎన్నికల గొడవలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించాం. 39 ముఖ్యమైన జంక్షన్ లు గుర్తించాం.48 షాడో పార్టీలను , 65 రాత్రి గస్తీ బృందాలు ఏర్పాటు చేశాం.46 మంది పోటెన్సియల్ ట్రబుల్ మాంగర్స్ ను గుర్తించాం. సమస్యలు సృష్టించే అనుమానమున్న 7,094 మందిని బైండోవర్ చేశాం. అవసరమైన చోట్ల , అత్యవసరమైన చోట్ల 18 పోలీసుల బలగాలను ఏర్పాటు చేశాం.ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నాము. కౌంటింగు జరిగే జిల్లా కేంద్రంతో పాటు అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో, సమస్యాత్మక గ్రామాలలో ప్రత్యేక నిఘా వేశాం.జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం బాణసంచా నిల్వ ఉంచడం, క్రయ విక్రయాలు చేయడం, కాల్చడం నిషేధము.ఎవరైనా అనధికారికంగా మద్యం, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం . శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా… ముందస్తు చర్యలులో భాగంగా రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు, పాత కేసుల్లో నిందితుల ఇళ్ల పరిసరాలలో జిల్లాలో 65 చోట్ల కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించాం.జిల్లా అంతటా కౌంటింగు ముగిసే వరకు 144 సెక్షన్ ఉత్తర్వులను గట్టిగా అమలు చేస్తాం. నలుగురి కంటే ఎక్కువ ప్రజలు గుమిగూడకూడదు. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా కర్నూలు పట్టణంలో 144 సెక్షను మరియు 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుంది. కాబట్టి ప్రజలు అవసరమైతే మాత్రమె తప్ప రోడ్లపైకి రాకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం.ఎవరైనా కౌంటింగ్ సమయంలో అవాంతరాలు కల్పించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే ఏజెంట్లు, అభ్యర్ధులు(క్యాండిడేట్స్) ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించాలి. ఎన్నిక ఫలితాలు వెలువడిన అనంతరం గెలుపొందిన అభ్యర్దులు వారి మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం , డప్పులు వాయించడం, పెద్ద శబ్దాలు , భాణ సంచా పేల్చడం వంటివి నిషేధించాం.గెలుపోటములు సహజమని, ఓడిన వారి పట్ల కవ్వింపు చర్యలకు పాల్పడటం, హేళన చేయడం, రెచ్చగొట్టడం చేయరాదు.కౌంటింగ్ వేళ అపరిచితులు, అనుమానితులు లాడ్జిల్లో బస చేయకుండా చర్యలు తీసుకున్నాం. లాడ్జిల్లో తనిఖీలు ముమ్మరం చేశాం. యువత అల్లర్లు, గొడలలో పాల్గొని , కేసుల్లో ఇరుక్కొని భవిష్యత్తును పాడుచేసుకోకూడదని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోనికి అనుమతి ఉన్నది.కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్దులు ఉదయమే కౌంటింగ్ కేంద్రాల్లో ఉండాలి, మొబైల్ ఫోన్లు కౌంటింగ్ కేంద్రంలోనికి అనుమతి లేదు. అభ్యర్థుల వెంట గన్ మెన్ లకు మాత్రమే అనుమతి ఉంటుంది. కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్ధులు, ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది పసుపుల రోడ్డులోని రాయలసీమ యూనివర్సీటి కౌంటింగ్ కేంద్రంలోకి బాయ్స్ హస్టల్ మెయిన్ గేట్ నుండి రావలెను.మీడియా వారు రాయలసీమ యూనివర్సిటీ ఎంట్రన్స్ గేట్ నుండి వచ్చి మీడియా రూమ్ కు చేరుకోవలెను. ఇది వరకే లూజ్ పెట్రోల్ ఇవ్వకుండా అన్ని పెట్రోల్ స్టేషన్ లకు నోటీస్ లు కూడా ఇవ్వడం జరిగింది. ఫైర్ క్రాకర్ లు కౌంటింగ్ రోజున అమ్మకుండా ఉండేందుకు ఫైర్ క్రాకర్ గోడౌన్స్ కు నోటీస్ లు ఇవ్వడం జరిగింది.అదే విధంగా జంక్షన్ డైవర్షన్ పాయింట్, కట్ ఆఫ్ పాయింట్, ట్రాఫిక్ డైవర్షన్ వంటి భద్రత ఏర్పాట్ల చేశాం.మే 13 తేదిన జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలీంగ్ రోజున అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించారని, అదే విధంగా జూన్ 4 వ తేదిన జరగబోయే ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా పోలీసు యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ విజ్ఞప్తి చేశారు.