PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

4 వేల మంది పోలీసులతో  ఎన్నికలకు పటిష్ట భద్రత…

1 min read

కర్నూలు జిల్లా ఎస్పీ  జి. కృష్ణకాంత్ ఐపియస్

శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు… ఎన్నికలకు సర్వం సిద్ధం .

 పోలీంగ్ కేంద్రాల వద్ద   పోలీసు బలగాల మోహరింపు.

పోలింగ్ ప్రక్రియకు ఎవరైనా అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు.

సమస్యాత్మక  గ్రామాల పై ప్రత్యేక దృష్టి … పోలీసు బలగాలతో ప్రత్యేక నిఘా.

ఓటర్లు.. తమ  ఓటు  హక్కును నిర్భయంగా , స్వేచ్ఛగా  వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశాం.

పోలీంగ్ రోజు  పోలింగ్ బూత్ పరిసరాల్లో   సెక్షన్ 144 సిఆర్ పి సి అమలు.

ఎన్నికలు  ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు  ప్రతి ఒక్కరూ  సహకరించాలి.మే 13న (సోమవారం) సార్వత్రిక  ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో  ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని ముందు జాగ్రత్త భద్రతా చర్యలను చేపట్టిందని ప్రజలు స్వేచ్ఛాయుతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని  జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో జరుగుతున్న  ఆయా నియోజక వర్గాలలో  గల అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టడం జరిగిందన్నారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహించడమే తమ లక్ష్యమని ఇందుకోసం కేంద్ర సాయుధ బలగాలతో పాటు జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందన్నారు.పోలింగ్ జరుగుతున్న సమయం లో అప్రమత్తంగా ఉంటూ, ఓటర్లతో పాటుగా వృద్ధులకూ, వికలాంగులు, మహిళలకూ ఏ ఇబ్బందులు తలెత్తకుండా, స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తోడ్పడాలి .జిల్లాలోని  2,204 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఇందులో 320 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ మరింత కట్టుదిట్టమైన  భద్రత ఏర్పాట్లు చేశాము.పోలింగ్ బూత్ ల దగ్గర  ఓటర్లు , ప్రజలు  గుంపులు, గుంపులుగా గూమి కూడకుండా చర్యలు తీసుకోవాలి .పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధి లోపల ఎవరూ గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకోవాలి.  సంబంధంలేని వ్యక్తులను పోలీంగ్ బూత్ లలోకి  అనుమతించకూడదు. 

ఎన్నికల విధులకు బందోబస్తు …

జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో న్యాన్ కేడర్ ఎస్పీ ఒకరు, నలుగురు అడిషనల్ ఎస్పీలు ,   14 మంది డిఎస్పీలు,  ఇద్దరు ట్రైనీ డిఎస్పీలు,  47  మంది సిఐలు / ఆర్ ఐలు , 74 మంది ఎస్సైలు ,40 మంది ట్రైనీ ఎస్సైలు,  477  మంది ఎఎస్సై లు / హెడ్ కానిస్టేబుల్స్,  8 మంది  ఎఆర్ ఎస్సైలు ,136 మంది  ఎఆర్ ASI /  హెడ్ కానిస్టేబుల్స్,  1051 మంది సివిల్  పోలీసులు , 258 మంది ఎఆర్ పోలీసులు, 812 మంది హోంగార్డులు,  3 ప్లటూన్ల  ఎపిఎస్పీ బలగాలు,  10 కంపెనీల CAPF పారా మీలటరీ బలగాలు, 150 మంది కర్ణాటక పోలీసులు , 410  మంది కర్ణాటక హోంగార్డులు, 372 మంది ఎక్స్ సర్వీస్ , NCC, NSS సిబ్బంది  బందోబస్తు విధుల్లో పాల్గొంటారు.  విధులలో పోలీసులు అప్రమతంగా ఉండాలని , విధులలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీగారు తెలిపారు.పోలింగ్ కేంద్రాలపై నిరంతరం కమాండ్ కంట్రోల్ ద్వారా నిత్యం పర్యవేక్షణ ఉంటుందన్నారు. డ్రోన్ కెమెరాలు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు, ప్లయింగ్ స్క్వాడ్స్ ,  పోలీసు రూట్ మొబైల్స్ లతో పోలీంగ్ కేంద్రాల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేశాము. పోలింగ్ రోజున ఓటర్లకు అంతరాయం కలిగించేలా చేస్తే  పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించి ఎంతటి వారినైనా ఉపేక్షించదన్నారు.  ఎన్నికల్లో ఏ చిన్న పాటి సంఘటన చోటు చేసుకున్నా అక్కడ విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది  సత్వరమే స్పందించాలన్నారు.ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎన్నికల ప్రక్రియను అంతా సిసి కెమెరాలతోను, సమస్యాత్మక ప్రాంతాలు డ్రోన్ కెమెరాలు,  వీడియో కెమెరాలతో  చిత్రీకరణ చేయాలని తెలియజేశారు.ఏదైనా అనుకొని సంఘటన జరిగితే వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం అందించాలన్నారు.ఎన్నికల సంఘం నిబంధనలు అనుసరించి నిర్వహించాలని, విధులు కేటాయించిన చోట తమ విధులను పారదర్శకముగా నిర్వర్తించాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ తెలిపారు.

About Author