విద్యార్థులు సమయం వృధా చేసుకోకండి
1 min readDy.Eo. వెంకటరామి రెడ్డి
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని ఆదోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెంకటరామిరెడ్డి సూచించారు. పత్తికొండ మండల కేంద్రము, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెంకట రామి రెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో 10 తరగతి చదువుతున్న విద్యార్థునిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పించిన అన్ని సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.సమయం వృదాచేయకుండా ఇష్టంతో కష్టపడి చదువుకోవాలని అన్నారు.మీ తల్లి తండ్రులు మిమ్ములను కష్ట పడి చదివిస్తున్నారు.కావున వారి ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత మీపై ఉందని తెలిపారు. ఇప్పటినుండే ప్రతి సబ్జెక్టు లో ఉదయం సాయంత్రం ఏమి నేర్చుకుంటున్నారో డైరీ లో రాసుకొని వచ్చి మీ టీచర్లకు చూపించలని అన్నారు.మీరు మంచి మార్కులను సాధించాలని,సంస్కారవంతులుగా తయారైతే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని తెలిపారు.మీకు చదువు చెప్పిన టీచర్లను ,చదువుకున్న పాఠశాల ను జీవితాంతం గుర్తుంచు కోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ప్రధానోపధ్యాయురాలు భ్రమరాంబ ,పాఠశాల బోధనా సిబ్బంది ,బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.