రాష్ట్రస్థాయి ఆటలలో విద్యార్థులు అద్భుత ప్రతిభ
1 min readజూడో టోర్నమెంట్లో వెండి పధకంతో మరిన్ని పతకాలు
విద్యార్థులను అభినందించిన కళాశాల ప్రిన్సిపల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ఈ నెల 27 నుండి 29 వరకు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ లో జరిగిన రాష్ట్రస్థాయి ఆటల పోటీల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం, వట్లూరు విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. జూడో టోర్నమెంట్లో ఒక వెండి పతకం తో పాటుగా మొత్తం ఏడు పతకాలు సాధించారు. డెబ్భై కేజీల విభాగం లో టి. దివ్య తేజ రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం లో నిలువగా, రామలక్ష్మి మరియు రంజని అనే విద్యార్థులు మూడవ స్థానంలో నిలిచారు. జూనియర్స్ విభాగంలో మనోహరిణి, ప్రవల్లిక మరియు సబ్ -జూనియర్స్ విభాగం లో కె. దయ, లక్ష్మి కావ్య రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలిచి అందరిని ఆకట్టుకున్నారు. తమ విద్యార్థులు క్రీడల్లో రాణించడం ఎంతో ఆనందంగా ఉందని కళాశాల ప్రిన్సిపాల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి అన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు సునీల కుమారి మరియు భవానిలను, విద్యార్థినులను అభినందించారు.