ప్రభుత్వ వైఫల్యంతోనే విద్యార్థుల ఫెయిల్ !
1 min readపల్లెవెలుగువెబ్ : పదవ తరగతి పరీక్షా ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారని మండిపడ్డారు. ఇంట్లో తల్లిదండ్రులపైనే నెపం వేస్తారా? అని ప్రశ్నించారు. 10 గ్రేస్ మార్కులు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్ కాపాడాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సరైన విద్య అందించే చర్యలు చేపట్టాలన్నారు. రీవాల్యుయేషన్కు రూ.500 కట్టాలంటూ మరో దోపిడీకి తెర తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు తీసుకోకూడదని పవన్కళ్యాణ్ అన్నారు.