స్పోర్ట్స్ అథ్లెటిక్ మీట్లో పాల్గొ నున్న సెయింట్ తెరిసా కళాశాల విద్యార్థులు
1 min readమూడు విభాగాల్లో బంగారు పతకాలు,9 విభాగాల్లో వెండి పథకాలు , నాలుగు విభాగాల్లో కాస్య పథకాలు గెలుచుకున్నారు
అభినందించిన ప్రిన్సిపాల్ డా:పి మెర్సీ ,అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: డిసెంబర్ 13, 14 వ తేదీల్లో రాజమహేంద్రవరంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారిచే నిర్వహించబడిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అథ్లెటిక్ మీట్లో స్థానిక సెయింట్ థెరెసా స్వయం ప్రతిపత్తి మహిళా కళాశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. సెయింట్ తెరెసా క్రీడాకారులు మూడు విభాగాలలో బంగారు పతకాలు, 9 విభాగాలలో వెండి పతకాలు, మరియు 4 విభాగాలలో కాంస్య పతకాలు సాధించారని ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ పి మెర్సీ తెలియజేసారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మరియా క్రిష్టియ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సిస్టర్ సుశీల, వ్యాయామాధ్యాపకులు మరియు విభాగాధిపతి డాక్టర్ పిఎం సెలియన్ రోజ్, అధ్యాపకురాలు కే శ్యామలను, మరియు క్రీడాకారులను అభినందించారు.