లహరికి శ్రద్ధాంజలి ఘటించిన విద్యార్థులు..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలను ఖండించాలని పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ కే జునైద్ భాష డిమాండ్ చేశారు. మంగళవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని నంది జూనియర్ కళాశాలలో చదువుతున్న అమ్మాయి లహరి ప్రేమోన్మాది చేతిలో సోమవారం ఉదయం మృతి చెందిన సందర్భంగా స్థానిక పటేల్ సెంటర్ నందు విద్యార్థులతో ర్యాలీగా వచ్చి పూలతో శ్రద్ధాంజలి ఘటించారు విద్యార్థులు..ఈ సందర్బంగా జునైద్ బాష మాట్లాడుతూ దేశంలోనూ అలాగే రాష్టంలో ను అనేక చోట్ల నిత్యం మహిళతో పాటు అమాయక బాలికల మీద హత్యలు,అత్యాచారాలు జరుగుతున్నాయని వాటిని నిర్ములించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. అనేక చట్టాలు అమలులో ఉన్న కూడా సభ్య సమాజం తలదించుకొనేలా ఘటనలు జరగడం బాధాకరమన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం లో ఇప్పటికి రెండు ప్రధాన ఘటనలు జరిగినందున వెంటనే ప్రభుత్వం స్పందించి అమ్మాయి కుటుంబానికి 50 లక్షల నష్ట పరిహారంతో పాటు అమ్మాయి తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం ఎల్ )న్యూ డెమోక్రసీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి వై నరసింహులు,బి.గోపాల్ మరియు శివ తదితర కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.