శాస్త్రీయ విద్యా విధానంకై విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలి
1 min readప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలి: ఏఐఎస్ఎఫ్
పల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న విద్య ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ కాషాయకరణకు వ్యతిరేకంగా శాస్త్రీయ విద్యా విధానంపై విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి విజయేంద్ర తెలిపారు.అనంతరం ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ విజేంద్ర,ఏఐఎస్ఎఫ్ నాయకులు రంగస్వామి, సమీవుల్లా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని వర్తింపు చేసే విధంగా ఎన్డీఏ కూటమి ఆలోచన చేయాలని సందర్భంగా కోరారు .ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి చదువుకుంటున్నారనీ, కావున వారికి ఉచిత విద్యతో పాటు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అందించాలని,మధ్యాహ్న భోజన పథకం లేకపోవడం వలన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరుబోయే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతుందని, ముఖ్యంగా అమ్మాయిలు డ్రాపోర్ట్స్ గా మిగిలిపోతున్నారు . తక్షణమే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి కొనసాగిస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వ విద్యారంగం నాశనం అయ్యి మరింత ఇంటర్ విద్య కార్పొరేట్ మయం కావడానికి ప్రభుత్వమే కారణం, మధ్యాహ్నం భోజన పథకాన్ని నిర్వీర్యం చేస్తే కచ్చితంగా రాబోయే రోజుల్లో విద్యార్థులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఖాదర్,దస్తగిరి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ నూతన జూనియర్ కాలేజ్ కమిటీ ఎన్నికకళాశాల అధ్యక్షుడు: బాబు ఉపాధ్యక్షులు: ఎర్రి స్వామి, వీరేష్, నాని, ఆంజనేయులు, కళాశాల కార్యదర్శి: శంకర్, సహాయ కార్యదర్శి : శ్రీనివాసులు, కార్తీక్, వీరాంజనేయులు, ఉపేంద్ర, కోశాధికారి: రాజశేఖర్, వీరితోపాటు కౌన్సిల్ సభ్యులు 30 మందిని ఎన్నుకోవడం జరిగింది.