గ్రంధాలయాల ద్వారా విద్యార్థులు విజ్ఞానాన్ని పెంచుకోవాలి
1 min readజిల్లాకలెక్టర్ కె వెట్రి సెల్వి
గ్రంథాలయంను సందర్శించి ఉన్న పుస్తకాలను పరిశీలించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: గ్రంధాలయాలు విజ్ఞాన బాండాగారాలని, విద్యార్థుల వాటిని ఉపయోగించుకుని తమ విజ్ఞానాన్ని పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విద్యార్థులకు సూచించారు. కొవ్వలి జిల్లా పరిషత్ హై స్కూల్ లో గ్రంథాలయాన్ని సందర్శించి, అందులోని పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా లైబ్రరీ లో అందుబాటులో ఉన్న పుస్తకాలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ విద్యార్థినీ, విద్యార్థులు పుస్తక పఠనాన్ని ఒక అభిరుచిగా చేసుకోవాలన్నారు. పాఠశాలలోని గ్రంధాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులకు ఏ అంశాలలో అభిరుచి ఉందొ తెలుసుకుని, అందుకు సంబందించిన పుస్తకాలను లైబ్రరీలో వారికి అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల ప్రధానోపాద్యాయులు శర్మ ని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, జిల్లా విద్యా శాఖాధికారి వెంకట లక్ష్మమ్మ, తహసీల్దార్ సుమతి, ఎంపిడిఓ శ్రీదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.ఎల్. ఎన్ .వి.జి. శర్మ, సర్పంచ్ మధులత, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ గణేష్ కుమార్, ప్రభృతులు పాల్గొన్నారు.