PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది

1 min read
కర్నూల్ హాట్ అండ్ బ్రెయిన్  మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
అధినేత ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: యూనివర్సల్ కలాటే మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారంనాడు ఉదయం పెద్ద మార్కెట్ ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగాగుండె సంబంధిత నిపుణులు కార్డియాలజిస్ట్ డాక్టర్ పి చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు కరాటే లాంటి మాస్టర్ యాడ్స్ లో సాధన చేయడం వల్ల శరీరం మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోను రాణించాలని చెప్పారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలిక విద్యార్థులకు ఆత్మ రక్షణ కోసం కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఎంతో అవసరం అన్నారు.కరాటాల్లో సాధన చేసిన విద్యార్థులు విభిన్న రకాల బెల్టులను సాధించడం అభినందియం అన్నారు.విద్యార్థులు క్రీడల్లో పాటు చదువులో రాణించి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా ఎదిగి దేశానికి సేవా అందించాలని ఆయన అన్నారు కలర్ మరియు బ్లాక్ బెల్ట్ ను సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.ఈ బెల్ట్ టెస్ట్ కు 35 మంది చిన్నారులు పాల్గొన్నారు అని బ్లాక్ బెల్ట్ లు సాధించిన కే.పూర్ణిమ.ఎస్ ఎం డి.సార్ భాష.ఎం.ఉదిత్.ఎస్ ఎం.డి.సాదిక్.ఎస్ ఎం డి.జాద్ బాషా.ఎగ్జామినర్లుగా కే.చిరంజీవిలు.ఎం.క్రాంతి. ఎస్.మున్వర్ పాల్గొన్నారు అని మాస్టర్ టి.శ్రీనివాసులు తెలిపారు.

About Author