దంచి కొట్టిన వర్షాలు నీట మునిగిన పంటలు లబోదిబోమంటున్న రైతులు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో సోమవారం రాత్రి భారీ వర్షాలు కురిసాయి. భారీ వర్షాలకు వంకలు వాగులు పొంగిపోర్లాయి. పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామం వద్ద ప్రవహిస్తున్న అందరి వంక కు భారీ వరద రావడంతో అందరి వంక లోతట్టు ప్రాంతాల నిర్జలమయమయ్యాయి. పంట పొలాలని నీట మునిగాయి. చిన్నహుల్తి, జూటూరు మండగిరి గ్రామాల పంట పొలాలని నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కంది ఉల్లి పత్తి టమోటా పంటలన్నీ నీట మునిగి రైతులను భారీగా నష్టాలకు గురి చేసింది. చేతికొచ్చిన పంట నేటి పాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దాదాపు అందరినీవా పరివాహక ప్రాంతంలో భారీ వర్షం 500 ఎకరాల లో పంట నష్టం జరిగినట్లు అంచనా. ఈ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయి ప్రభుత్వం కల్పించాలని కోరుతున్నారు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి పంటలు మునిగిపోయాయి హంద్రీ ,వంక ఒకచోట కలిసిన ప్రదేశంలో సుమారు 500 ఎకరాలు లలో ఐదు అడుగుల మేర పొలాల్లో నీరు ప్రవహించినట్లు రైతులు తెలిపారు. జూటూరు కు చెందిన వడ్డెమహానంది 8 ఎకరంలో పత్తి మిరప సాగు చేశాడు. కుండపోత వర్షం కురవడంతో వాగులు వంకలు ఏకమై తన పంట పొలంలో ఐదు అడుగుల మేర నీరు ఉండడంతో కొట్టుకుపోయిందని రైతు వా పోయాడు. నీటి మునకలో ఉన్న తన పంట పొలాన్ని చూసి రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రభుత్వం పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, ఈ విషయమై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ,నారా లోకేష్ వెంటనే స్పందించాలని లేకుంటే ఆత్మహత్య శరణ్యం అని రైతు వడ్డే మహానంది ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఇన్ని రోజులు వర్షం రాకపోవడంతో పంట ఎండిపోయాయి, వంక దగ్గరలో ఉన్న పంటలు మునిగిపోవడంతో వర్షం వచ్చిందని కొంతమంది రైతుల సంతోషపడుతుంటే వంక దగ్గరలో ఉన్న రైతులు లబోదిబోమంటున్నారు. ఈ భారీ వర్షంతో హంద్రీనీవా ,వంక పొంగడంతో పత్తికొండ ఎమ్మిగనూరు ఆదోని మధ్య రాకపోకలు నిలిచిపోయాయి .