ఓటు హక్కు ఉన్న ప్రతి రైతులు సొసైటీలో తమ వివరాలను సమర్పించండి..
1 min readసీఈఓ ఆదినారాయణ..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: రైతు సోదరులు గడివేముల సొసైటీ నందు ఓటు హక్కు కలిగిన ప్రతీ రైతు వారి యొక్క ఆధార్ కార్డు,పాన్ కార్డు, పొలము పాసుబుక్ జిరాక్స్, మూడు ఫోటోలు మరియు వారి యొక్క నామిని ఆధార్ కార్డు జిరాక్స్ లను సొసైటీ ఆఫీసు నందు ఇవ్వవలసినదిగా గడివేముల మండల సొసైటీ సి ఈ ఓ ఆదినారాయణ మంగళవారం నాడు తెలిపారు సొసైటీలను కంప్యూటరైజెషన్ చేయుచున్నందున పైన కనబరిచిన సమాచారాన్ని ఈనెల 30 తేదీ లోపు ఇవ్వవలసినదిగా తెలిపారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. సి. ఆదినారాయణ (సి. ఇ. ఓ ) 9963896144. హరిప్రసాద్ (క్లర్క్ ) 9989694909.