సబ్సిడీ విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి… సిపిఐ
1 min readఆర్డీవో కార్యాలయంలో ఏవో నాగభూషణం కు వినతి పత్రం ఇస్తున్న సిపిఐ నాయకులు.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: 2024-25 సంవత్సరం ఖరీఫ్ సీజన్ కు సంబంధించి సబ్సిడీ విత్తనాలను రైతులకు ఉచితంగా ఇవ్వాలని సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం సిపిఐ ప్రతినిధి బృందం ఆర్డీవో కార్యాలయంలో ఏవో నాగభూషణం కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో అరకొర కురిసిన వర్షాలకు రైతులు వివిధ రకాల పంటలను సాగు చేశారని, అయితే సరైన వర్షాలు కురువకపోవడంతో రైతులు సాగు చేసిన పంటలన్నీ ఎండిపోయి, పంట పెట్టుబడి కూడా చేతికి రాక తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. గత ఏడాది రైతులు తీసుకున్న అన్ని రకాల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయాలన్నారు.ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అన్ని రకాల సబ్సిడీ విత్తనాలను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు గురుదాస్, కారన్న, కొత్తపల్లి పందికోన శాఖ కార్యదర్శులు గిడ్డయ్య గౌడ్, జోహారాపురం కాశీ, హనుమంతయ్య ఆచారి, తదితరులు పాల్గొన్నారు.