పండ్ల తోటల పెంపకంపై రాయితీ : ఏపీడీ అన్వరా బేగం
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకానికి వంద శాతం రాయితీ ఉంటుందని ఆత్మకూరు క్లస్టర్ ఉపాధి ఏపీ డీ అన్వరా బేగం అన్నారు. నందికొట్కూరు ఉపాధి హామీ కార్యాలయంలో సోమవారం సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఆత్మకూరు క్లస్టర్ నందు వివిద మండలాలకు టార్గెట్ ఇవ్వడం జరిగిందని ఆత్మకూరు-160 ఎకరాలు,అత్మకూరు ఐటీడిఏ-150,జూపాడు బంగ్లా-200ఎకరాలు కొత్తపల్లి-150ఎకరాలు, నందికొట్కూరు-150,పగిడ్యా ల -100 ఎకరాలు, పాములపాడు-150 ఎకరాలు వెలుగోడు-150 ఎకరాలు పైన కనబరిచిన మండలాలకు 1065 ఎకరాలు టార్గెట్ ఇవ్వడం జరిగిందన్నారు. మొత్తం 663.87 ఎకరాలు ఐడెంటిఫికేషన్ చెయ్యడం జరిగింది వాటిలో 499.22 ఎకరాలు మంజూరు అయ్యింది.మంజూరు అయిన వాటిలో 439.34 ఎకరాలు పిట్టింగ్ చెయ్యడం జరిగింది. పిట్టింగ్ చేసిన వాటికి 100.69 ఎకరాలకు ప్లాంటింగ్ చేశామని అదేవిధంగా అన్ని మండలాల ఉపాధి సిబ్బంది ఆగష్టు 15 లోపు పిట్టింగ్ చేయాలని సిబ్బందికి సూచించడం జరిగింది పిట్టింగ్ చేసిన వాటికి ఈనెల చివరి లోపు ప్లాంటింగ్ చేయాలని ఆదిశించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏ పీఓ మంగమ్మ ఈసీ షబాన, జలసిరి స్వాములు సిబ్బంది పాల్గొన్నారు.