రెండు మద్యం దుకాణాల్లో ‘‘విజయం’’
1 min readఅదృష్టం అంటే కమ్మరి విజయ్ దే
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మండల పరిధిలోని మాధవరం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు కమ్మరి విజయ కుమార్ కి ప్రభుత్వ మద్యం దుకాణాల రూపంలో అదృష్టం వరించింది. పేరు లోనే ఉంది విజయం ఇంక అంత విజయమే. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రభుత్వ మద్యం దుకాణాలు టెండర్ల లాటరీ పద్ధతిలో మండలంలో ఉన్న రెండు దుకాణాలు కమ్మరి విజయ కుమార్ కు దక్కాయి. మంత్రాలయం టీడీపీ ఇంచార్జి మాధవరం రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు తుంగభద్ర లో ఒక దుకాణం, మాధవరం లో ఒక దుకాణం కు రూ టెండర్లు వేయడం జరిగింది. ఇందులో రెండు దుకాణాలు ఒక పేరు మీదే లాటరీ పద్ధతిలో రావడం ఎంతో అదృష్టం గా భావిస్తున్నారు. ఒకరే దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు అని పలువురు చర్చించుకుంటున్నారు. రెండు దుకాణాలు దక్కడం తో రాఘవేంద్ర రెడ్డి అనుచరులు మంత్రాలయం, మాధవరం లో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.