PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరు జిల్లాలో సజావుగా 144  మద్యం దుకాణాలకు పూర్తయిన లాటరీ ప్రక్రియ

1 min read

లాటరీ ప్రక్రియను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

జిల్లాలో 144 మద్యం దుకాణాలకు5,499 దరఖాస్తులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీడిప్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి వెల్లడించారు. సోమవారం ఉదయం  స్థానిక చలసాని గార్డెన్స్ లో మద్యం దుకాణాల కేటాయింపునకు లక్కీడిప్‌ ప్రక్రియను ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఉదయం 8 గంటల ప్రారంభమైన లక్కీడిప్‌ ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి, జాయింట్‌ కలెక్టర్‌ పీ. ధాత్రిరెడ్డి ఆధ్వర్యంలో  నిర్వహించారు.  ప్రశాంతంగా నిర్వహించిన దుకాణాల లక్కీడిప్‌ ప్రక్రియ మధ్యాహ్నం 4 గంటల వరకు కొనసాగింది.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంతంగా, పారదర్శంగా మద్యం దుకాణాల కేటాయింపు లక్కీడిప్‌ ప్రక్రియ పూర్తయినట్లు  చెప్పారు.   పూర్తి ప్రక్రియను వీడియోగ్రఫి తో చిత్రీకరించినట్లు చెప్పారు. ఆయా షాపులకు టెండర్లు దాఖలు చేసిన దరఖాస్తుదారుల సమక్షంలోనే లక్కీడిప్‌ తీసి షాపు దక్కించుకున్న వారి పేరును ప్రకటించినట్లు కలెక్టర్‌ చెప్పారు. జిల్లాలో 144 మద్యం దుకాణాలకు 5,499మంది టెండర్లు దాఖలు చేయగా, 144 మద్యం షాపులకు లక్కీడిప్‌ ద్వారా 144 మందిని ఎంపిక చేసినట్లు కలెక్టర్‌ చెప్పారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ డిప్యూటీ కమిషనర్‌ బి.శ్రీలత, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఏ.ఆవులయ్య, అడిషనల్ ఎస్పీ ఎన్.సూర్య చంద్రరావు,ఇన్చార్జి డి ఆర్ ఓ దేవకీదేవి,ఏలూరు ఆర్డీవో అచ్యుత్ అంబరీష్ ,డిఎస్ డి.శ్రవణ్  కుమార్,పి జడ్పీ సీఈవో కె.సుబ్బారావు,డి అర్ డి ఏ పిడి ఆర్.విజయరాజు,డిఎస్ వో ఆర్ఎస్ఎస్ రాజు,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు యం.ముక్కంటి, కె.భాస్కర్ తహసీల్దార్ శేషగిరి,ఎక్సైజ్‌ పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఏలూరు అర్బన్ ..21,ఏలూరు రూరల్ 4,దెందులూరు మండలం 4, పెదపాడు మండలం 11,చింతలపూడి నగర పంచాయతీ  2,చింతలపూడి రూరల్ 3,కామవరపుకోట మండలం 4,లింగపాలెం మండలం 4,టి.నరసాపురం మండలం 3,భీమడోలు మండలం 7,ద్వారక తిరుమల మండలం 5, ఉంగుటూరు మండలం 7, నిడమర్రు మండలం 3,జంగారెడ్డిగూడెం అర్బన్ 7, జంగారెడ్డిగూడెం రూరల్ 4, కుక్కునూరు మండలం 02, పోలవరం మండలం 3, కొయ్యలగూడెం మండలం 5, కైకలూరు మండలం 14, ముదినేపల్లి మండలం 5, మండవల్లి మండలం  3,నూజివీడు అర్బన్ 3,నూజివీడు రూరల్ 4,ఆగిరిపల్లి మండలం 4,చాట్రాయి మండలం 2,ముసునూరు మండలం 3, జీలుగుమిల్లి మండలం 2,వేలేరుపాడు మండలం 01 బుట్టాయిగూడెం మండలం 4 షాపులకు లాటరీ విధానంలో మద్యం దుకాణాలు కేటాయింపు జరిగాయి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *