జిల్లా విద్యాశాఖాధికారి ఆకస్మిక తనిఖీ
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : గడివేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, గురువారం నాడు జిల్లా విద్యాధికారి సుధాకర్ రెడ్డి ఆకస్మిక మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతులను పరిశీలించి జిందాల్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పాఠశాలకు వచ్చిన స్కూల్ బ్యాగులను త్వరగా పంపించేయాలని ఎంఈఓ ను సూచించారు. పదవ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్త శాతం సాధించాలని ప్రధానోపాధ్యాయుల్ని డీఈఓ కోరారు. అనంతరము గడిగరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సాంకేతికతను ఉపయోగించి విద్యార్థులకు బోధన చేయాలని, ప్రణాళికా ప్రకారము సిలబస్‌ను పూర్తి చేయాలని మరియు వర్క్ బుక్కులను ఎప్పటికప్పుడు సరిదిద్దాలని తెలిపారు. డిఇఓ సుధాకర్ రెడ్డి వెంట, ఏ.పి.ఓ.ఎస్.ఎస్. డి.సి.లక్ష్మీనారాయణ ఉన్నారు.