జిల్లా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం
1 min readపెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఉమ్మడి ప:గో: జిల్లా గ్రంథాలయ సంస్థ ఏలూరు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్ర గ్రంథాలయo లో “వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం” (సమ్మర్ క్యాంప్) లో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులకు “రిసోర్సెస్ పర్సన్” డి.శ్రీవల్లి విద్యార్థులందరికీ ముందుగా “సరస్వతి నమస్తుభ్యం” మరియు విఘ్నేశ్వర స్వామి గీతం”శుక్లo భరదరం విష్ణుమ్” దేవుని ప్రార్ధన గీతాలతో ప్రారంభించారు. అనంతరం విద్యార్థులచేత “స్టోరీ టెల్లింగ్” మంచి మంచి నీతి కథలు చదివించి కథల్లోని నీతిని చిన్నారుల చేత వివరించారు. మరియు “కిచెన్ లో ఉండే పప్పు ధాన్యాలపై” చిన్నారులకు అవగాహన కల్పించారు. మరియు “మాటల గారడీ – నా పేరులో ఇంకొక పేరు” అనే అంశాల పై సరదా గేమ్స్ ఆడించారు. ఎమ్. కల్యాణి “రిసోర్సెస్ పర్సన్” విద్యార్థులకు జనరల్ అవేర్నెస్ (G.K) పై క్విజ్ పోటీలు నిర్వహించారు. మరియు టి. నళిని “రిసోర్సెస్ పర్సన్” విద్యార్థులకు దేశ భక్తీ పాటలు, (సారే జహన్ సే అచ్చః, రఘపతి రాఘవ రాజారాం) మరియు అన్నమాచార్య కీర్తనలు, దేవుని పాటలపై శిక్షణ కొనసాగించారు. ఈ శిక్షణా కార్యక్రమoలను డిప్యూటీ లైబ్రేరియన్ ఎ. నారాయణ రావు పర్యవేక్షించడం జరిగింది. మధ్యలో విద్యార్థులందరికీ స్నాక్స్ పంచి పెట్టడం జరిగింది.కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంధాలయం సిబ్బంది వి టి సందీప్ కుమార్, ఎండీ. ఎ. అస్లాం పాషా, విద్యార్ధులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.