జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం
1 min readడిప్యూటీ లైబ్రేరియన్ ఏ నారాయణరావు ఆధ్వర్యంలో రక్షణ కార్యక్రమాలు
8 గంటల నుండి 11:30 వరకు విద్యార్థులకు శిక్షణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : శనివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ, ఏలూరు జిల్లా కేంద్ర గ్రంధాలయం లో “వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం” (సమ్మర్ క్యాంప్) లో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు శనివారం ఉదయం 8:00 గంటల నుండి 11: 30 గంటల వరకు “రిసోర్స్ పర్సన్”లు విద్యార్థుల చేత నీతి కథలు, దేశభక్తి గీతాలు, సరదా గేమ్స్, పేపర్ క్రాఫ్ట్స్, మెమరీ గేమ్స్ లో శిక్షణ ను కొనసాగించారు. మధ్యలో విద్యార్థులందరికీ స్నాక్స్ పంచి పెట్టడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాలను డిప్యూటీ లైబ్రేరియన్ ఎ.నారాయణ రావు పర్యవేక్షించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో “రిసోర్స్ పర్సన్ లు డి.శ్రీ వల్లి, జి. కళ్యాణి, టి. నళినీ, కె.మహిదర్, హేలాపూరి చిల్డ్రన్స్ క్లబ్ టీమ్ సెక్రటరీ దుర్గా ప్రసాద్ , జిల్లా కేంద్ర గ్రంధాలయం సిబ్బంది వి టి సందీప్ కుమార్, ఎండీ. ఎ. అస్లాం పాషా, ఎమ్. కనక దుర్గ, విద్యార్థులు ,పేరెంట్స్, అధిక సంఖ్యలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.