జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం
1 min readచిన్నారులచే నాటక ప్రదర్శనలో శిక్షణ
చిన్నారులు ఉత్సాహంతో నేర్చుకున్న అంశాలపై జవాబులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయం లో “వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం” (సమ్మర్ క్యాంప్) చాలా ఆహ్లాదంగా సాగుతుంది. విధ్యార్ధులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. శనివారం రిసోర్స్ పర్సన్ డి.శ్రీవల్లి ప్రారంభించారు. అనంతరం “పుస్తక పఠనం” చేయించారు. రకరకాల ఆధ్యాత్మిక కథలు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, నీతి కథలు, చదివించారు. మరియు చదివిన పుస్తకాల ఆధారంగా “రిసోర్స్ పర్సన్” క్విజ్ రూపంలో ప్రశ్నలు అడిగారు. విధ్యార్ధులు ఎంతో ఉత్సాహంగా జవాబులు ఇచ్చారు. అనంతరం చిన్నారుల చేత యోగతో కూడిన సరదా గేమ్స్ ఆడించారు. “నేనూ ఒక చెట్టును” అనే అంశం పై చిన్నారుల చేత నాటక ప్రదర్శన లో శిక్షణ ఇచ్చారు .అనంతరం కె. శంకర్ డ్రాయింగ్ టీచర్ & రిసోర్స్ పర్సన్ విద్యార్థులకు రకరకాల డ్రాయింగ్స్ వేసి వాటిలోని మెలుకువలు నేర్పించారు, శిక్షణ ను కొనసాగించారు. మధ్యలో విద్యార్థులందరికీ స్నాక్స్ & చల్లటి పానీయాలను ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో జి. కల్యాణి , కె. మహీధర్ , ఎమ్. క్రాంతి కుమార్, జిల్లా కేంద్ర గ్రంథాలయం సిబ్బంది శ వి .టి .సందీప్ కుమార్, ఎండీ. ఎ. అస్లాం పాషా, బి వి ఎస్. లక్ష్మీ, విధ్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.