PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరాలు

1 min read
వివిధ అంశాలపై వినోద, విజ్ఞాన సమ్మర్ క్యాంప్
డిప్యూటీ లైబ్రేరియన్ ..ఎ నారాయణరావు పర్యవేక్షణలో శిక్షణా కార్యక్రమాలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : మంగళవారం ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో "వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం" సమ్మర్ క్యాంప్ చాలా ఆహ్లాదకరంగా,ఉత్సాహంగా జరుగుతుంది. ఈ శిక్షణ శిబిరం నకు విద్యార్థులు చాలా హుషారుగా పాల్గొంటున్నారు. ఈరోజు ఉదయం 8:00 గంటల నుండి 11:30 గంటల వరకు "రిసోర్స్ పర్సన్" డి శ్రీవల్లి ముందుగా సరస్వతి నమస్తుభ్యం ప్రార్ధన గీతాలతో ప్రారంభించారు. అనంతరం పుస్తక పఠనం లో బొమ్మరిల్లు కథలు, దేశభక్తి కథలు, మోరల్ స్టోరీస్ ,లను విధ్యార్ధుల చేత చదివించారు. అనంతరం రంగు రంగు కాగితాలతో "పేపర్ క్రాఫ్ట్స్" మరియు "బొమ్మలు తయారు" చేయుట పై శిక్షణ ను కొనసాగించారు. ఈ శిక్షణ శిబిరం నకు వచ్చిన విద్యార్థులకు రిసోర్స్ పర్సన్స్ లు విజ్ఞానం, వినోదం తో కూడిన ఈ సమ్మర్ క్యాంప్ ప్రత్యేకించి మీ కోసమే పెట్టించింది కాబట్టి ముందుగా ప్రభుత్వానికి & పౌర గ్రంథాలయ శాఖా వారికీ సంతోషం గా విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేసారు. అనంతరం ప్రముఖ డ్రాయింగ్ టీచర్ & రిసోర్స్ పర్సన్ కె. శంకర్ విద్యార్థులకు రకరకాల డ్రాయింగ్స్ పై శిక్షణ ను కొనసాగించారు. మధ్యలో విద్యార్థులందరికీ చల్లటి పానీయాలు& స్నాక్స్ పంచి పెట్టడం జరిగింది. ఈ శిక్షణ తరగతులను డిప్యూటీ లైబ్రేరియన్ ఎ. నారాయణ రావు పర్యవేక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జి. కళ్యాణి, జిల్లా కేంద్ర గ్రంధాలయం సిబ్బంది విటి సందీప్ కుమార్,ఎండీ. ఎ. అస్లాం పాషా, ఎమ్. కనక దుర్గ, విధ్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


About Author