కులమతాలకు అతీతంగా సుంకప్ప తాత ఉరుసు
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లోని నాగలదిన్నే రోడ్డు లో వెలసిన శ్రీ సుంకప్ప( వన్నురసాబ్) తాత ఉరుసు దర్గా పీఠాధిపతి ఖాజాహుశేన్ తాత, సుంకప్ప తాత వంశస్థులు రాఘవేంద్ర అధ్వర్యంలో కులమతాలకుఅతీతంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి గంధం తాత వంశస్థులు ఇంటి నుండి దర్గా వరకు ఊరేగింపుగా వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్గా ను వివిద రకాల విద్యుత్ దీపాలతో, పుష్పాలతో పట్టువస్త్రాలతో సుందరంగా అలంకరించారు. దర్గా ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి భక్తులు, గ్రామ ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేశారు. భజన లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీరి వెంట ముల్లా సాబ్ లు అన్ను, కునాల్, నన్నే సాబ్, మౌలా, శెక్శావలి, పో దర్శించుకున్న పలువురు నాయకులు : సుంకప్ప తాత ఉరుసు మహోత్సవం పురస్కరించుకుని పలువురు నాయకులు దర్శించుకుని పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వైకాపా మండల అధ్యక్షులు బీంరెడ్డి, టిడిపి నాయకులు మాధవరం రాఖేష్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వీరి కి పీఠాధిపతి ఖాజాహుశేన్ తాత శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ రామాంజులు ఆదేశాలతో ఎస్సై పరమేష్ నాయక్ అధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.