PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూపర్ సిక్స్ సూపర్ టెన్ పేరుతో కూటమి మరో మోసానికి తెర

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం ఎల్లార్తి బిజీ హాల్ పెద్ద హేట చిన్న హేట  లో గడప గడప ప్రచారం లో భాగంగారాబోయే ఎన్నికల్లో దేవుని దీవెనలతో ప్రజల ఆశీస్సులతో175/175 ఖచ్చితంగా గెలుస్తాంఈ కార్యక్రమంలో శ్రీ బుసినే విరుపాక్షి మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ టెన్ పేరుతో చంద్రబాబు ఆయన కూటమి 2014లో మాదిరిగా మరోసారి మోసానికి తెరతీసే దానికి ముందుకొస్తున్నారు మీరంతా జగనన్న మంచిని చూసి ఓటెయ్యండి. సీఎం జగనన్న పాలన ఒక చరిత్ర, భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పాలనను ఈ 58 నెలల కాలంలో చేసి చూపించిన ఘనత ఒక్క సీఎం జగనన్నకే సాధ్యం అని బుసినే విరుపాక్షి  అన్నారు.ఇచ్చిన మాట తప్పకుండా చేసి చూపించిన ఒకే ఒక్క నాయకుడు జగనన్న మాత్రమే అని  బుసినే విరుపాక్షి  అన్నారు .ఈ ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేది నా కల అని శ్రీ బుసినే విరుపాక్షి  అన్నారు .నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి అనేది నా ఆశయం .ఆలూరు నియోజకవర్గం అభివృద్ధికి, ప్రజలకు సేవ చేయడానికి నన్ను ఒక్కసారి మీ బిడ్డగా ఆశీర్వదించమని అడుగుతున్నాను అని బుసినే విరుపాక్షి  అన్నారు .నేను ప్రజాసేవ చేయడానికే వచ్చాను, నాకు డబ్బు మీద ఆశ లేదు, ప్రజల  లక్ష్యం కోసమే పని చేస్తానని బుసినే విరుపాక్షి  అన్నారు .ఈ కార్యక్రమంలో  వైఎస్సార్సీపీ నియోజకవర్గ కుటుంబ సభ్యులు , అసెంబ్లీ జేసిఎస్ కో-ఆర్డినేటర్  ఓబులేష్ , జెడ్పీటిసి శేషప్ప , ఎంపీపీ ఈషా , మండల కన్వీనర్ షఫీ ఉల్లా , వైస్ ఎంపీపీ కేంచప్ప , కో -కన్వీనర్ రవికుమార్ ,SK గిరి , ఆఫీజ్ ఈమనా , జేసిఎస్ మండల ఇంచార్జ్ మల్లికార్జున, రామకృష్ణ,ముద్దట మాగి వెంకటేష్, హనుమప్ప, ముక్కర నందీష్, దుర్గ ప్రసాద్ మరియు సచివాలయ కన్వీనర్లు, రైతు సంఘం అధ్యక్షులు, విద్యా కమిటీ చైర్మన్, సొసైటీ చైర్మన్లు, గృహ సారథులు, నాయకులు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

About Author