PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు పెదాలకు వరాలు: మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి:  తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు పేదవారికి వరం లాంటిదని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ప్యాపిలీ పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం లో భాగంగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ స్థానిక పట్టణంలో నీ హుసేనాపురం వీధి, మైన్ బజార్, కింది గేరు మీదుగా,మండల పరిధిలోని నల్లమేక పల్లె గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని కిందికేరిలో కడితం ప్రతాపరెడ్డి ఆధ్వరంలో సుజాతమ్మ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అరాచక పాలన సాగనంపి సుపరి పరిపాలన కోరుకోవాలని ప్రజలును అమె కోరారు. సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు పొందాలంటే చంద్రబాబునాయుడు సీఎం చేసుకొని డోన్ నియోజకవర్గం లో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి ని ఎమ్మెల్యే గా గెలిపించుకోవాలని ఆమె కోరారు. అంతేకాదు నియోజకవర్గానికి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి  సైకలు గుర్తుపై ఒక ఓటు, ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి కి ఒక ఓటు వేసి అఖండ మెజార్టీని గెలిపించుకొని, తెదేపా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు పొందాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోట్ల శ్రీనాథ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,టిడిపి రాష్ట్ర కార్యదర్శి వై వై నాగేశ్వరావు యాదవ్, డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజనారాయణమూర్తి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, ఖాజాఫీర్, గడ్డం అంకిరెడ్డి , టిడిపి నాయకులు నల్లమెకల పల్లె సత్యం, రాజశేఖర్,గొల్ల రామ్మోహన్ యాదవ్, నాగేంద్ర, కిట్టు, దిమ్మగుడి లక్ష్మి రంగారెడ్డి, ఎస్కే వలి, సుంకన్న, జక్కిరెడ్డి గోపాల్ రెడ్డి, రామిరెడ్డి, సంఘటి ప్రసాద్ రెడ్డి, కే కోటిరెడ్డి, బద్రి గోవింద్ రెడ్డి తదితరులు తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author