PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మిగనూరు.. ప్రభుత్వ ఆసుపత్రి  సూపరిండెంట్ ను సస్పెండ్ చేయాలి

1 min read

చేయకపోతే దశలవారిగా ఉద్యమం నిర్వహిస్తాం….

పి.డి.ఎస్.యు, పిడిఎస్ఓ సంఘాలు హెచ్చరిక….

ప్రభుత్వ ఆసుపత్రి  సూపరిండెంట్ ను సస్పెండ్ చేయకపోతే దశలవారిగా ఉద్యమం నిర్వహిస్తాం….

పి.డి.ఎస్.యు, పిడిఎస్ఓ సంఘాలు హెచ్చరిక….

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణం లో ప్రభుత్వ ఆసుపత్రి లో విధులు నిర్వహిస్తున్న సూపరిండెంట్ ఉద్యోగం నుండి రిలీవ్ చేయాలని  పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి  మహేంద్ర బాబు, పిడిఎస్ఓ  జిల్లా ఉపాధ్యక్షులు సురేంద్రబాబు డిమాండ్ చేశారు.  శుక్రవారం స్థానిక  న్యూ డెమోక్రసీ కార్యాలయంలో  విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యం పేరుతో ప్రైవేటు క్లీనిక్ ఏర్పాటు చేసుకొని గర్భిణీల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ పసిపిల్లల   ప్రాణాలు తీస్తుందని భాదితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా డి.సి.హెచ్.ఎస్ అధికారులు విచారణకు వచ్చి మూడు రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఏలాంటి చర్యలు తీసుకోలేదు. భాదితుడి ఇచ్చిన ఫీర్యాదు ను స్వీకరించి పై స్థాయి అధికారులకు నివేదిక పంపి ఆపై చర్యలు తీసుకుంటామని చెప్పి వెళ్లిపోయారు. దీంతో ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ మాత్రం తన వైద్యం దోపిడీ మాత్రం ఆగడం లేదు. జిల్లా అధికారుల ఆదేశాలను పెడచెవిన పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వ వైద్యురాలకు జిల్లాలో రాజకీయ బలం కూడ మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ బలం అండదండలతో జిల్లా అధికారులను కూడ నోరెత్తకుండా చెయ్యడమే కాకుండా ఫీర్యాదు ను కూడ పక్కన పెట్టించే పరిస్థితిలు తీసుకువస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి గర్భిణీల, పసి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వ వైద్యురాలు పై త్వరితగతిన విచారణ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాల చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధి సంఘాల నాయకులు రాజు,నరసింహ రెడ్డి, రాజేష్, ఇమ్రాన్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

About Author