PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హాకీ అభివృద్ధికి తోడ్పాటు …సీఐ ఇంతియాజ్ భాష

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో, మరియు హాకీ కర్నూలు జిల్లా సహకారంతో, వేసవి కాల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగాపాల్గొని ,హాకీగా అభివృద్ధికి తమ వంతు సహాయం, సహకారం అందిస్తామని , రెండవ పట్టణ,సీ.ఐ ఇంతియాజ్ భాషా తెలిపారు. మున్సిపల్ హై స్కూల్ లో జరిగిన ముగింపు,కార్యక్రమంలో,వారు మాట్లాడుతూ విద్యార్థి స్థాయి నుండి హాకీలో మెలకువలు,నేర్చుకుని ,జిల్లా ,రాష్ట్ర స్థాయి ,జాతీయ స్థాయిలో ,పాల్గొని మంచి ఉన్నత ఉద్యోగాల్లో ఉండాలని తెలిపారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి, భూపతి రావు మాట్లాడుతూ ,రాష్ట్రంలో హాకీ కి,కర్నూలు జిల్లా మంచి పేరు ఉందని ,ఆ పేరును అదేవిధంగా ఉంచాలని తెలిపారు. భవిష్యత్తులో జాతీయ స్థాయి లో పాల్గొనే క్రీడాకారులకు, సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాకీ సంఘం కార్యదర్శి ,దాసరి సుధీర్ ,వైస్ ప్రెసిడెంట్, ప్రవీణ్ ,సమ్మర్ కోచ్ భరత్ ,యోగ మాస్టర్ ,రాఘవేంద్ర ,మొదలగు వారు పాల్గొన్నారు.

About Author