జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరావు రైతు సేవా కేంద్రం ఆకస్మిక తనిఖీ
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: జిల్లా వ్యవసాయ అధికారి ఐతే నాగేశ్వరరావు మంగళవారం చెన్నూర్ 3 రైతు సేవా కేంద్రం ఆకస్మిక తనిఖీ చేయడం చెస్తారు. ఈ పంట మరియు ఈ కేవైసీ జరుగుతున్న తీరును పరిశీలించినారు. సెప్టెంబర్ 15 చివరి తేదీ కావున రైతులు ఈ పంట మరియు ఈ కేవైసీ ని పూర్తి చేసుకోవాలని తెలియజేశారు. గ్రామంలోని వరి మరియు బంతి (చెండుమల్లి) పొలాలను సందర్శించడం జరిగినది .వరిలో సూడోమనస్ లీటరు నీటికి పది గ్రాములు పిచికారి చేయడం వలన పాముపొడ మరియు అగ్గి తెగులు రాకుండా కాపాడుకోవచ్చని రైతు లుకుతెలియజేశారు.అదేవిధంగా రైతులు పురుగుమందులు పిచికారి చేసేటప్పుడు పురుగు ఉధృతి అనగా నిర్ణీత తీవ్రత స్థాయి అనగా ఉదాహరణకు వరిలో ఆకుముడుత కలుగజేసే పురుగు దుబ్బుకి ఒక లార్వా లేదా రెండు పురుగు సోకిన ఆకులు ఉన్నప్పుడు పిచికారి చేయవలెను లేదంటే పిచికారి చేయనవసరం లేదు అని తెలియజేశారు. బంతి వేసిన పొలం సందర్శించి ట్రైకోడెర్మా పశువుల ఎరువులతో అభివృద్ధి చేసి వేయుట వలన పూలు నాణ్యత మరియు సైజు పెరుగునని తెలియజేశారు.మండలవ్యసాయదికారి శ్రీ దేవి సిబ్బంది పాల్గొన్నారు.