PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూర్య నారాయణుడి సన్నిధిలో గురు పౌర్ణమి వేడుకలు

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో గురు పౌర్ణిమ వేడుకల్లో భాగంగా అత్యంత వైభవంగా ఆదివారం శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం కన్నుల పండుగగా జరిగింది.. శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అనుగ్రహంతో నిర్వహించే కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణపతి పూజ పుణ్యాహవాచనం పంచలోక పాలక పూజ నవగ్రహ ఆరాధన అష్టదిక్పాలక పూజ రమా సహిత సత్యనారాయణ స్వామి అభిషేకం తులసితో అర్చన చేసుకొని స్వామి కథలను శ్రవణం చేసి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. 2000 మందికి పైగా భోజన ప్రసాదం (అన్నదానం) తీసుకొని స్వామి కృపకు  పాత్రులైనట్లు ఆలయ కమిటీ చైర్మన్​ రామకృష్ణారెడ్డి తెలిపారు.

దత్తత్రేయుడికి… క్షీరాభిషేకం..

 దేవాలయంలోని దత్తాత్రేయ స్వామికి విశేష క్షీరాభిషేకాలు తైలాభిషేకాలు దత్త హోమం జరుగుతున్నవి. శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి పాదుకలకు పంచామృత అభిషేకం జరిగినది.దత్త భక్తులు అలాగే మాతృమండలి సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

About Author