మిడుతూరులో’స్వచ్ఛ ఆంధ్ర..స్వచ్ఛ దివాస్’
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న చెత్తా చెదారాన్ని స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ లో భాగంగా అధికారులు ప్రజా ప్రతినిధులు వాటిని శుభ్రం చేశారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మిడుతూరు లో వారు ప్రారంభించారు.టీడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,ఎంపీడీఓ పి.దశరథ రామయ్య,తహసిల్దార్ టి. శ్రీనివాసులు,ఈఓఆర్డి సంజన్న,గ్రామ సర్పంచ్ జయ లక్ష్మమ్మ,డాక్టర్ తిరుపతి నాయకులు కమతం రాజశేఖర్ రెడ్డి,సుధాకర్ యాదవ్,నాగేంద్రపంచాయతీ కార్యదర్శి గోవింద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలలో మూడవ శనివారం రోజున చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.