PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘స్వకుళసాలే’..అభ్యున్నతికి కృషి చేస్తా..

1 min read

ఆశీర్వదించండి.. ఎమ్మెల్యేగా గెలిపించండి..

  • కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

 ఆదోని, పల్లెవెలుగు: ఆదోని పట్టణంలో అధిక సంఖ్యలో ఉన్న స్వకుళసాలే కులస్తుల అభ్యున్నతికి కృషి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు ఆదోని కూటమి (బీజేపీ–జనసేన–టీడీపీ) అభ్యర్థి డా.పార్థసారధి.  బుధవారం స్వకుళసాలే కులస్తులను మర్యాద పూర్వకంగా కలిసిన డా. పార్థసారధి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అభ్యర్థి పార్థసారధి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి కానీ… ఒక్క ఆదోని మాత్రం అలాగే వెనకబడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  పట్టణంలో యువత చదువుకోడానికి  ప్రభుత్వ కళాశాలలు లేకపోవడం…. చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రాకపోవడం ప్రధాన కారణమైతే.. ఒకప్పుడు సెకండ్​ బాంబేగా పేరుగాంచిన ఆదోనిలో కాటన్​ మిల్లు, స్పిన్నింగ్​ మిల్లు, రాయలసీమ మిల్లులు మూతపడటంతో ఉపాధి లేక వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పక్క నియోజకవర్గాలైన  ఎమ్మిగనూరుతో పోలిస్తే… ఆదోనిలో తాగునీరు వారానికోసారి వస్తోందని, కాల్వలు, రోడ్లు లేక  ప్రజలు అవస్థలు పడుతున్నా.. పదైదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్​ రెడ్డి ఇవేవీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వాల్మీకి వర్గానికి చెందిన తాను …ఆదోనిలో ఉంటానని, ఆదోని అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో నిధులు రాకపోతే… కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పించే బాధ్యత నాది అని పట్టణవాసులకు హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే… స్వకుళ సాలే కులస్తులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి డా. పార్థసారధి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ , బీజేపీ, జనసేన నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author