స్వామి వివేకానంద జయంతి..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కురువ సంఘము ఆధ్వర్యంలో ఆదివారం నగరం లోని రాజవిహార్ సర్కిల్ లోని స్వామి వివేకానంద 162 వ జన్మదినం సందర్బంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న,జిల్లా ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయులు, ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి, కోశాధికారి కె. సి. నాగన్న, సహాయ కార్యదర్శులు బి. సి. తిరుపాలు, కోత్తపల్లి దేవేంద్ర, పెద్దపాడు పుల్లన్న, నగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి బి. రామకృష్ణ, కోశాధికారి కె. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడిసె శివన్న, రంగస్వామి మాట్లాడుతూ స్వామి వివేకానంద ప్రపంచానికి సనాతన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల గొప్పతనాన్ని తెలియపరచిన మహానుభావులని కొనియాడారు.అలాగే స్వామి వివేకానందను యువకులు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువత పెడదారి పట్టకుండా మహానీయుడు వివేకానంద నందుని ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని వారు కోరారు.