PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐదేళ్ల విజన్​..​ స్వర్ణాంధ్ర@2047

1 min read

ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్  జిల్లా గ్రోత్ ఇంజన్

  • రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు టి.జి.భరత్

కర్నూలు, పల్లెవెలుగు: ఐదేళ్ల అభివృద్ధి లక్ష్యాలతో స్వర్ణాంధ్ర@2047 డాక్యుమెంట్ రూపకల్పన చేయడం  జరుగుతోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్  శాఖ మంత్రివర్యులు టి.జి.భరత్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర @2047 జిల్లా దార్శనిక ప్రణాళిక (2024-29) రూపకల్పనపై ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో  మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో  ఒక విజన్ తో ముందుకు వెళుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే స్వర్ణాంధ్ర@2047 ఐదేళ్ల విజన్ ప్రణాళికను రూపొందించడం జరుగుతోందన్నారు.. ప్రజా ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలతో గ్రామ,మండల, జిల్లా స్థాయిలో  ప్రణాళికలను రూపొందించడం జరుగుతోందన్నారు..జిల్లాలో ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్  గ్రోత్ ఇంజన్ అని, దీని వల్ల జిల్లాలో గణనీయమైన అభివృద్ధి సాధించనున్నామని మంత్రి తెలిపారు.  దాదాపుగా 2 వేల 800 కోట్ల రూపాయలతో ఓర్వకల్లు నోడ్ అభివృద్ధి కానుందని తెలిపారు..షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్  లక్ష్యాలతో ప్రణాళికను రూపొందించుకుని అమలు చేయనున్నామని  మంత్రి పేర్కొన్నారు..అధికారులు జిల్లా అభివృద్ధికి ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.

వ్యవసాయం..పరిశ్రమలపై దృష్టి: కలెక్టర్​ పి.రంజిత్​ బాషా

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ జిల్లాలో ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధన లక్ష్యంగా ఐదేళ్లకు స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికను రూపొందించడం జరుగుతోందని  పేర్కొన్నారు.  ప్రధానంగా  వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో అభివృద్ధిపై దృష్టి సారించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ రంగాలతో పాటు విద్యా, వైద్య రంగాల్లో కూడా  అభివృద్ధి సాధించే విధంగా ప్రణాళికను రూపకల్పన చేసి దానిని అమలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. జిల్లా  గ్రోత్ ఇంజన్ లో భాగంగా ఓర్వకల్లు పారిశ్రామిక వాడ పై దృష్టి పెట్టడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా అన్ని రంగాల్లో మరింత వృద్ధి చెందే విధంగా ప్రణాళికను రూపొందించి, అమలు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా  110 కోట్ల రూపాయలతో  రోడ్లను నిర్మించడం జరిగితోందని కలెక్టర్ తెలిపారు.. వీటిని మార్చ్ 2025 నాటికి పూర్తి చేసే  విధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.

చెరువులు నింపండి..: పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ  కర్నూలు నగరంలో తన నియోజకవర్గానికి సంబంధించిన 16 వార్డుల్లో త్రాగు నీటి సమస్య పరిష్కారానికి గోరుకల్లు రిజర్వాయర్ నుండి నీరు తీసుకుని రావాలని కోరారు..ఈ వార్డు లోఅదే విధంగా రోడ్లు, డ్రెయిన్స్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని,  పార్కులు చాలా వరకు అన్యాక్రాంతం అవుతున్నాయని, వాటి మీద ప్రత్యేక దృష్టి సారించి,  పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు.. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కు సంబంధించి అన్ని విభాగాల్లో సౌకర్యాలు ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ మెరుగుపరచాలని కోరారు..  ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం వల్ల ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని, స్థానికంగా చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుగా  నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గుండ్రేవుల రిజర్వాయర్ ను నిర్మాణం చేయాలని,   ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో అన్ని చెరువులను కూడా నింపాలని సూచించారు.

ఆదోని అభివృద్ధి చేద్దాం :ఎమ్మెల్యే డా. పార్థసారధి

ఆదోని శాసనసభ్యులు డా.పార్థసారథి వాల్మీకి మాట్లాడుతూ ఆదోని ప్రాంతంలో ఉన్న ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో ప్రతి నెల సుమారుగా 450 ప్రసవాలు జరుగుతున్నాయని, 10 మంది నర్సింగ్ సిబ్బందిని నియమించాలని కోరారు.. ఆదోని లో ఆరోగ్య శ్రీ క్రింద కొన్ని ఆస్పత్రులు రోగుల నుండి డబ్బు వసూలు చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు..వలసల నివారణకు  కస్తూర్బా, జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని, వసతి గృహాల్లో ఉన్న విద్యార్థినులకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, శానిటరీ నాప్కిన్స్ అందజేసేలా చూడాలన్నారు. అంతేకాకుండా కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని,   విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. టూరిజంకు సంబంధించి రణమండల ఆంజనేయ స్వామి దేవాలయానికి రోడ్డు మార్గం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా ఆదోని ఆటో నగర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.. ఆదోని మార్కెట్  యార్డు లో మౌలిక వసతులు కల్పించాలని, మార్కెట్ యార్డు లో దళారులు రైతులను వడ్డీ పేరుతో ఇబ్బందులకు గురి చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆర్డీఎస్​ రైట్​ కెనాల్​ నిర్మాణం చేపట్టండి :ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్​ రెడ్డి

 ఆ తరువాత ఎమ్మిగనూరు శాసనసభ్యులు బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్డిఎస్ రైట్ కెనాల్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో 2000 కోట్లతో మంజూరు చేసి టెండర్ పిలిచారని అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం రివర్స్ టెండర్రింగ్ తో మూలన వేశారని తెలిపారు. ఎమ్మిగనూరు ప్రాంతానికి సాగు తాగునీరు లభించేందుకు వీలుగా ఆర్డీఎస్ రైట్ కెనాల్ నిర్మాణం, గాజులదిన్నె రిజర్వాయర్ అభివృద్ధి, వాటర్ గ్రిడ్ లను ఏర్పాటు చేయాలని  కోరారు..వాటర్ గ్రిడ్ ద్వారాఎమ్మిగనూరు నియోజకవర్గం లోని  మూడు మండలాలే కాకుండా పత్తికొండకు, కర్నూలుకు, త్రాగునీరు  వినియోగించుకోవచ్చన్నారు.  అలాగే  NH  to NH కనెక్షన్ రోడ్లు ఏర్పాటు చేయాలని, కాల్వబుగ్గ, వెల్దుర్తి, ఎమ్మిగనూరు నుండి బళ్ళారి నేషనల్ హైవే,  మెగా టెక్టైల్ పార్క్,  బనవాసి లో  లైవ్ స్టాక్ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి,  ఆలూరు ఎమ్మెల్యే  విరుపాక్షి వారి వారి నియోజవర్గాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్​ రంజిత్​ బాషా దృష్టికి తీసుకొచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *