PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాగ్రత్తలతో… టి2డి కంట్రోల్​…

1 min read

వ్యాయామం తప్పనిసరి…

  • సీనియర్​ ఎండోక్రోనాలజిస్ట్​ డా.భరత్​

కర్నూలు, పల్లెవెలుగు:ఆహారపు అలవాట్లలో మార్పు… వ్యాయామం లేకపోవడం…తదితర కారణాలతో వచ్చే టైప్​ 2 డయాబెటిస్​ ( మధుమేహం) ను జాగ్రత్తలతో కొంత కంట్రోల్​ చేయవచ్చన్నారు సీనియర్​ ఎండోక్రోనాలజిస్ట్​ డా.భరత్త్​. ఆదివారం స్థానిక ఏ క్యాంపులోని కర్నూలు హార్ట్ ఫౌండేషన్​ ప్రధాన కార్యదర్శి, కార్డియాలజిస్ట్​  ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​ నేతృత్వంలో మెడికల్​ విద్యార్థులకు ‘ టైప్​ 2 డయాబెటిస్​ మిల్లిటస్​’ పై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. భరత్​ టి2డి  నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. టి2డి ని డయాబెటిస్​ మెల్లిటస్​ యొక్క ఒక రూపం. దాహం పెరగడం… తరచూ మూత్ర విసర్జన, అలసట మరియు బరువు తగ్గడం , ఆకలి పెరగడం, పుండ్లు (గాయం) తగ్గకపపోవడం  వంటి లక్షణాలను టి2డి కలిగి ఉంటుంది. సమయానికి ఆహారం, పండ్లు తీసుకోకపోవడం.. వ్యాయామం చేయకపోవడం… జన్యుపరంగానూ మధుమేహం–2 అధికమయ్యే అవకాశం ఉందని… దీనికి జాగ్రత్తలతో కంట్రోల్​ చేయవచ్చని వెల్లడించారు.

టి2డి తో…. వచ్చే వ్యాధులు…

షుగర్​ వ్యాధి ఉన్న వాళ్లలో వందకు 90శాతం మంది జనాభాకు టైప్​ 2 మధుమేహం ఉంది. మిగిలిన 10 శాతం జనాభాకు టైప్​ 1 కలిగి ఉన్నారు. టైప్​ 2  కారణంగా హై బ్లడ్​ షుగర్​ వల్ల గుండెజబ్బులు, గుండె పోటు , డయాబెటిస్​ రెటినోపతి వల్ల అంధత్వం, మూత్రపిండ వైఫల్యం కావచ్చు. అంతేకాక అవయవాలలో రక్త ప్రసరణ బలహీనంగా ఉంటుంది.

జాగ్రత్తలతో… టి2డి కంట్రోల్​…

ఊబకాయం లేదా వ్యాయామం లేకపోవడంతో మధుమేహం–2 ఎక్కువ మందికి వస్తోంది.  ఆహారపు ( పండ్లు, కూరగాయలు తీసుకోవడం) అలవాట్లలో మార్పు… చికిత్సలో వ్యాయామం.. రక్తంలో షుగర్​ స్థాయిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటే… నియంత్రించుకునే అవకాశం మెండుగా ఉంటుంది. షుగర్​ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. సమయానికి మందులు వాడటం వల్ల టి2డి ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. నిరంతరం షుగర్​ వ్యాధి వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉంటే బాగుంటుందని  సీనియర్​ ఎండోక్రోనాలజిస్ట్​ డా.భరత్ స్పష్టంగా వెల్లడించారు.

డా. భరత్​ కు ఘన సన్మానం

కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టైప్​ –2 డయాబెటిస్​ మెల్లిటస్’కు ముఖ్య అతిథిగా విచ్చేసిన   సీనియర్​ ఎండోక్రోనాలజిస్ట్​ డా. భరత్​ను సీనియర్​ కార్డియాలజిస్ట్​, ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​ ఘనంగా సన్మానించారు. ముందుగా శాలువా కప్పి, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో హార్ట్​ ఫౌండేషన్​ సభ్యులు చంద్రశేఖర్​ కల్కూర, డా. భవాని తదితరులు పాల్గొన్నారు.

  •  

About Author