వైటీపిఎల్ నిర్వహణ పై చర్యలు తీసుకోండి…
1 min readపి.డి.ఎస్.యు ,యుఎసఫ్ఐ,బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమైక్య సంఘాలు డిమాండ్.
డిఎస్పి ఉపేంద్ర బాబు కు వినతి పత్రం అందజేసిన విద్యార్థి నాయకులు..
పరీక్షల సమయం లో విద్యార్థులను తప్పు దోవ పట్టిస్తున్నారు అని ధ్వజం….
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణంలోని ఎమ్మిగనూరు యూత్ ఐకాన్స్ పేరట ఐపీఎల్ తరహాలో వై టి పి ఎల్ సీజన్ వన్ అనుమతులు ఇవ్వకండి అని పి.డి.ఎస్.యు , యుఎస్ఎఫ్ఐ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమాఖ్య సంఘాల నాయకులు శేఖర్, ఉదయ్, బి.మహేంద్ర బాబు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక పట్టణంలో సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ ఉపేంద్ర బాబు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి మొదటి వారం నుంచి టెన్త్ ఇంటర్ డిగ్రీ బోర్డు పరీక్షల ప్రారంభంలో కానున్న తరుణంలో ఇలాంటి వైటీపీఎల్ లీగులు ఐపీఎల్ తరహాలో నిర్వహిస్తూ ఉండటం విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని అంతేకాకుండా కానిస్టేబుల్, గ్రూపు 2 పరీక్షలు నోటిఫికేషన్ వెలువడి వాటికి సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆటంకంగా మారుతున్నాయని ఇలాంటి లీగల్ పేరట యువతను విద్యార్థులను జూదానికి అలవాటు చేసే ప్రయత్నంగా ఈ లీగల్ ఉన్నాయని తక్షణమే వీటికి అనుమతులు రద్దు చేయాలని అంతే కాకుండా విద్యార్థులను బెట్టింగుల,గంజాయి మాదకద్రవ్యాలకు వ్యసనపరులుగా మారుస్తున్నారని తక్షణమే ఇలాంటి లీగుల కు అనుమతులు రద్దు చేయాలని డిఎస్పీ ని కోరారు విద్యార్థుల ఉన్నతమైన భవిష్యత్తును తప్పుదోవ పట్టించే విధంగా విద్యార్థుల ను చదువుకు దూరం చేసేవిగా ఉన్నాయని తక్షణమే వీటి అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షం లో ప్లేయర్ సెలక్షన్ ఆక్షన్ ను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు నరసింహారెడ్డి, గోవర్ధన్, హరి, వీరారెడ్డి, రఘు, సిద్దు తదితరులు పాల్గొన్నారు.