జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ఆదోని: మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలనీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిఅన్నారు. బుధవారం హనవాళు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి మన సమస్యలను తెలుసుకున్నారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా మూడవరోజు హనువాళు గ్రామంలో గ్రామ సభల్లో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈరోజు పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి భూమి పూజ చేసి ప్రారంభిస్తున్నామని, ఆ విధంగా ఈ పథకం కింద వస్తున్నటువంటి నిధులను ప్రతి ఒక్కరూ సక్రమంగా ఉపయోగించుకుని గ్రామాలని అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే పార్థసారధి ప్రజలను కోరారు.