ఆత్మకూరు లో ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్ అకాడమిని సద్వినియోగం చేసుకోండి
1 min readపస్పిల్ మున్నా.. శ్రీశైలం శాసనసభ్యులు శ్రీ.బుడ్డా రాజశేఖర్ రెడ్డి సహకారంతో ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు : పస్పిల్ మున్నా ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో క్రీడా అవగాహన సదస్సును వాలీబాల్ శిక్షకులు అజ్జ్గర్ అలి మరియు నిమ్మి.కృష్ణ యాదవ్ లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మకూరు స్టేడియం లో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శిక్షణను పూర్తిగా ఉచితంగా పొందవచ్చన్నారు. ఉద్యోగ నియామకానికి చ్చదువుతో పాటు క్రీడలు చాల ముఖ్యమని ముఖ్యంగా బాలికలు క్రీడల్లో రావడం వల్ల సులువుగా స్పోర్ట్స్ కోటా క్రింద ఉద్యోగాల్లో అవకాశాలు పొందవచ్చని అన్నారు. ఆత్మకూరు స్టేడియం లో వాలీబాల్,ఖోఖో,కబడ్డీ,తైక్వాండో షటిల్,బాల్ బ్యాట్మింటన్ క్రీడల్లో శిక్షణ పొందవచ్చని అవకాశాన్ని ఆత్మకూరు పట్టణ మరియు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. వాలీబాల్ శిక్షకులుగా అజ్గార్ అలి ,రైల్వే వాలీబాల్ కోచ్ నిమ్మి.కృష్ణ యాదవ్ ,ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పిల్ మున్నా , తైక్వాండో శిక్షణ ఖాజా హుస్సేన్,సామన్నా, ఖోఖో క్రీడకు కి మహబూబ్ భాషా, బాక్సింగ్ కి ఉపేంద్ర,బాల్ బ్యాట్మింటన్ కి మురళీ యాదవ్ శిక్షణ ఇస్తున్నారన్నారు. కావున శ్రీశైలం శాసనసభ్యులు శ్రీ.బుడ్డా రాజశేఖర్ రెడ్డి గ కల్పిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని ఆసక్తి ఉన్న క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు నాయబ్.సయ్యద్ అసదుల్లా గారు,తైక్వాండో కోచ్ ఖాజా హుస్సేన్ , టైగర్ బాబు, ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ ఖోఖో వ్యాయామ ఉపాధ్యాయులు మహబూబ్ భాష , స్పోర్ట్స్ సభ్యులు ఇంతియాజ్ పాల్గొన్నారు.