PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 ‘గుండె’ పై.. కేర్​ తీసుకోండి…

1 min read

వ్యాయామం, సమతుల్య ఆహారంతో ఆరోగ్యం పదిలం..

  • బీపీ, షుగర్​ ను కంట్రోల్ లో ఉంచుకోండి..
  • ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ డా.డి. రాజశేఖర్

కర్నూలు, పల్లెవెలుగు:నిత్య విద్యార్థులు మాత్రమే వైద్యరంగంలో రాణించగలరని, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి గుండె శస్ర్తచికిత్సలపై నిరంతరం అధ్యాయనం చేయాలని మెడికల్​ విద్యార్థులకు సూచించారు  శ్రీ వెంకటేశ్వర  ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ప్రొఫెసర్​ ఆఫ్​ కార్డియాలజి డాక్టర్​ డి. రాజశేఖర్​. ప్రపంచ హృదయ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం నగరంలోని హార్ట్​ ఫౌండేషన్​ ఛాంబరులో ప్రభుత్వ మెడికల్​ కళాశాల ప్రొఫెసర్​ ఆఫ్​ కార్డియాలజి డా. చంద్రశేఖర్​ నేతృత్వంలో  కార్డియాలజి విద్యార్థులకు, ప్రజలకు గుండె ను కాపాడుకోవల్సిన తీసుకోవల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు తదితర అంశాలను డా. డి. రాజశేఖర్​ వెల్లడించారు.  వైద్య విద్యార్థులు గుండె పై నిరంతరం అధ్యాయనం చేయాలని సూచించిన డా. రాజశేఖర్​…. ప్రజలు కూడా గుండెపై కేర్​ తీసుకోవాలని స్పష్టం చేశారు. బైపాస్​ సర్జరి, ఆంజియోగ్రాం, ఓపెన్​ హార్ట్​ సర్జరీ తదితర ఆపరేషన్లను ఆధునిక టెక్నాలజీతో త్వరగా విజయవంతంగా పూర్తి చేయవచ్చని,  ఆ దిశగా కార్డియాలజీ విద్యార్థులు మెరుగు పడాలన్నారు.  శరీర భాగాలలో గుండె పాత్ర కీలకమని, దాన్ని భద్రంగా ఉంచుకోడానికి ప్రతి రోజు వ్యాయామం, సమతుల్య పోషక ఆహారం తీసుకోవాలన్నారు. అంతేకాక బీపీ, షుగర్​ ను కంట్రోల్ ఉంచుకోవాలని ప్రజలకు వివరించారు. అనంతరం కార్డియాలజి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.

హార్ట్​ ఫౌండేషన్​ సేవలు.. ప్రశంసనీయం:

నగరంలోని ఏ క్యాంపులో 2002 లో నిర్మించిన కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో వివిధ వ్యాధులకు సంబంధించిన వైద్య నిపుణులతో విద్యార్థులకు, ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు  శ్రీ వెంకటేశ్వర  ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ప్రొఫెసర్​ ఆఫ్​ కార్డియాలజి డాక్టర్​ డి. రాజశేఖర్. అంతేకాక 2003 నుంచి దాదాపు 22 సంవత్సరాలుగా ప్రపంచ హృదయ దినోత్సవంను జరుపుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు.  ఈ ఏడాది ప్రపంచ హృదయ దినోత్సవ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథులుగా పిలువడం ఆనందంగా ఈ సందర్భంగా కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​  గౌరవాధ్యక్షులు డా. భవాని ప్రసాద్​, ప్రధాన కార్యదర్శి డా. చంద్రశేఖర్​, కోశాధికారి చంద్రశేఖర్​ కల్కూరకు కృతజ్ఞతలు తెలిపారు.

డా.డి. రాజశేఖర్​ కు ఘన సన్మానం:

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా హార్ట్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించిన డా. డి. రాజశేఖర్​ ను  ఫౌండేషన్​ సభ్యులు ఘనంగా సన్మానించారు.ముందుగా శాలువా కప్పి, పూలమాలతో సత్కరించారు.

About Author