కరువు సహాయక చర్యలు చేపట్టండి
1 min readఉచితంగా విత్తనాలు, ఎరువులు ఇవ్వాలి
200 రోజులు ఉపాధి పని కల్పించాలి
తాసిల్దార్ కు వ్యవసాయ కార్మిక సంఘం వినతి
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : గత ఖరీఫ్,రబి సీజన్లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తీవ్ర కరువు నెలకొని రైతాంగానికి తీవ్ర నష్టాన్ని చవి చూపిందని,ఈ నేపథ్యంలోనే మండలంలోని రైతులు ,రైతు సంఘాలు డిమాండ్ మేరకు మండలాన్ని కరువు ప్రకటించి పరిహారం అందజేస్తున్నారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో మండలంలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ సిఐటియు మండల కార్యదర్శి అశోక్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నాడు స్థానిక తహసిల్దార్ కు కరువు సమస్యలపై వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా వీరశేఖర్,అశోక్ లు మాట్లాడుతూ, గత సంవత్సరం కరువు రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరిచిందని ఎకరాకు వేలకు వేలు పెట్టుబడులు పెట్టినప్పటికీ పంటలు పండక రైతులు తీవ్ర నష్టం చవిచూసారని తెలిపారు. అయితే ప్రభుత్వం మాత్రం అరకొర సహాయంతో రైతులకు న్యాయం చేయలేదని ఎకరాకు 20 వేల పరిహారం తో రైతులకు కాస్తయినా న్యాయం జరిగేదని వారి పేర్కొన్నారు. అదేవిధంగా కరువు ప్రకటించిన ప్రాంతాల్లో కరువు సహాయక చర్యల్లో భాగంగా ఈ ఖరీఫ్ మరియు రబీ సీజన్లో రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు ప్రభుత్వం సరఫరా చేయాలని, తద్వారా రైతాంగన్ని ఆదుకోవాలని వారి కోరారు. అలాగే విచ్చలవిడిగా మార్కెట్లలో ప్రత్యక్షమవుతున్న నకిలీ విత్తనాలు,మందుల బెడద నుండి రైతులను కాపాదాలని కోరారు. అధికారులు నిత్యం విత్తనాలు, ఎరువులు దుకాణాలపై తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పూర్తిగా వ్యవసాయ పనుల మీద ఆధారపడుతున్న కూలీలకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.