పోస్టల్ బ్యాలెట్ 100% జరిగేలా చర్యలు తీసుకోండి
1 min readఎలక్షన్ కమిషన్ కు ఆపస్ వినతి
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది వారి ఓటు హక్కును 100% వినియోగించుకునే విధంగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించాలని, ఈనెల రెండో తారీకు వరకు కూడా ఎన్నికల విధులకు సంబంధించినటువంటి ఆర్డర్లు ఉద్యోగులకు అందజేయడం జరిగిందని చాలామంది ఉద్యోగులు ఫారం 12 అందజేయ లేకపోయారని ,అలాంటి వారికి మరల అవకాశం ఇవ్వాలని, ఏదైనా కారణాల చేత జిల్లా కలెక్టర్ గారు సూచించిన సెంటర్లలో నిర్ణీత తేదీలలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోలేకపోయిన వారికి అనువైన తేదీలలో ఎన్నికల తేదీ తర్వాత కూడా వారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ ప్రధాన కార్యదర్శి జివి సత్యనారాయణ, రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్ శ్రావణకుమార్ ఓ ప్రకటనలో కోరారు. మహిళా ఉద్యోగులకు వారు పని చేస్తున్న ప్రాంతం నుండి సుదూర ప్రాంతాల్లో విధులు కేటాయించడం జరిగిందని, మహిళా ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా వారు పనిచేస్తున్న ప్రాంతానికి పక్కన ఉన్న నియోజకవర్గాల్లో విధులు కేటాయించాలని కోరారు. డ్యూటీ కి నియమించబడ్డ అందరూ పోస్టల్ బ్యాలెట్ పేపర్ వినియోగించుకునే విధంగా దరఖాస్తు చేసుకొనుటకు మరియు ఓటు హక్కు వినియోగించుటకు చేయాలని వారు కోరారు.