రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టండి
1 min readపెండింగ్ లో ఉన్న రోడ్డు మరమ్మత్తుల పనులను త్వరతగతిన పూర్తి చేయండి
పరిమితిని మించి ప్రయాణించే వాహనాలపై చర్యలు తీసుకోండి
ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
పల్లెవెలుగు వెబ్ ఆదోని: రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో సమావేశ మందిరంలో డివిజన్ స్థాయి రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సమీక్షలు జరిగిన రోడ్ సేఫ్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి ఆరా తీశారు. ముఖ్యంగా డివిజన్ పరిధిలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని ఆర్ అండ్ బి అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం వర్షాకాలం ఉన్న నేపథ్యంలో డ్రైనేజ్, మ్యాన్ హోల్ ఎప్పటికప్పుడు శుభ్రపరచి బ్లాక్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. బ్లాక్ స్పాట్స్ వాటిని గుర్తించి సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పరిమితి నుంచి వాహనాల్లో ప్రయాణించే వాహనాలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నూతన ట్రాఫిక్ చట్టాలను ప్రజలకు అవగాహన కల్పించి, రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించి వారిని హాస్పిటల్ కు తీసుకువెళ్లే సమయం జీరో అవర్/ గోల్డెన్ అవర్ వాటి ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి రోడ్డు భద్రత చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమానికి పరిపాలన అధికారి కే. వసుంధర, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, ఆర్టీవో నాగేంద్ర, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శిసిర దీప్తి, ఆర్ అండ్ డిప్యూటీ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డి. ఎం. హెచ్. వో సత్యవతి, డిఎల్పిఓ కార్యాలయపు పరిపాలన అధికారి వీరభద్రప్ప, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.