కురువ విద్యార్థుల ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘము ఆధ్వర్యంలో ఈ ఏడాది 10 వ తరగతి మరియు ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన కురువ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కోసం ఈ నెల 10 లోగ దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘము జిల్లా గౌరవ అధ్యక్షులు కే .కిష్టన్న ,జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పత్తికొండ శ్రీనివాసులు ,ఎం .కే .రంగస్వామి లు తెలిపారు .బుధవారం ఉదయం .స్థానిక సంఘము కార్యాలయం లో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది .ఈ సమావేశంలో లో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి మాట్లాడుతూ కర్నూలు ,నంద్యాల జిల్లాలోని 10 వ తరగతి మరియు ఇంటర్ రెండవ సంవత్సరం లో అత్యధిక మార్కులు సాధించిన కురువ విద్యార్థిని ,విద్యార్థులు తమయొక్క మార్కుల జాబితాను కింది వాట్సాప్ 9032741194,9440756199 ఈ నెల 10 వ తేదీ లోపు పంపగలరని కోరారు .ఈ సమావేశం లో జిల్లా కురువ సంఘము అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ,జిల్లా ఉపాధ్యక్షులు బి .వెంకటేశ్వర్లు ,కత్తి శంకర్ ,టి .ఉరుకుందు ,సహాయ కార్యదర్శి కే .దేవేంద్ర ,జిల్లా కోశాధికారి కే.సి .నాగన్న ,నగర సంఘము అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు జిల్లా నాయకులు బి .సి .తిరుపాలు ,పెద్దపాడు ధనుంజయ ,హరిదాసు ,పుల్లన్న ,కే .నాగయ్య జి .ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు .