యోగ పోటీలలో కేశవరెడ్డి విద్యార్థుల ప్రతిభ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఒలంపిక్ డే రన్ పురస్కరించుకొని ఒలంపిక్ డే సందర్భంగా జిల్లా యోగ సంఘం వారి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అంతర్ పాఠశాలల యోగా పోటీలు నగరంలోని అవుట్ డోర్ స్టేడియంలో జరిగాయి. ఆ పోటీలలో నగరంలోని వెంకటరమణ కాలంలోని కేశవరెడ్డి విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలతో ప్రతిభను చాటారు. వారిలో వరుణ్ (5వ తరగతి) మోక్షిత్ (6వ తరగతి) మోక్షిత్ (6వ తరగతి) రోహిత్ (7వ తరగతి) ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు, కీర్తన (5వ తరగతి) యువన్ (5వ తరగతి) హర్షిత్ (6వ తరగతి) హర్షాన్విత (7వ తరగతి) తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.ఈ సందర్భంగా కేశవరెడ్డి పాఠశాలల వ్యవస్థాపక అధ్యక్షులు యన్. కేశవరెడ్డి మాట్లాడుతూ నేడు సరైన వ్యాయమం లేక నిరంతర పని భారము చేత మానసిక ఒత్తిడికి గురై చాలామంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. అందుచేత ప్రతి ఒక్కరు యోగాసనాలతో తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సెలవిచ్చారు. ఆ క్రమంలోనే తమ విద్యార్థులకు చదువులతోపాటు ఇలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకునే యోగా లాంటి ఆసనాలు ప్రతినిత్యం తమ విద్యార్థుల చేత చేయిస్తూ, వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడంలో కేశవరెడ్డి పాఠశాలలు ఎల్లప్పుడూ ముందుంటాయన్నారు. ఆ క్రమంలోనే జిల్లాస్థాయి యోగ పోటీలలో తమ విద్యార్థులు ప్రతిభను చాటారన్నారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యాజమాన్య సిబ్బంది పాల్గొన్నారు.