తరిగోపులలో..రస్తా పంచాయితీ
1 min readన్యాయం చేయాలంటున్న కుటుంబం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల పరిధిలోని తరిగోపుల గ్రామంలో ఓ రస్తా ను ఆక్రమించుకోవడంపై గ్రామానికి చెందిన షేక్ బషి రున్నిసా,ఆలీమ్ భాష పాత్రికేయుల ఎదుటఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ఇంటికి ఎదురుగా నున్న ఎల్లయ్య మరియు వారి కుటుంబ సభ్యులు రెండు ఇళ్ళకు మధ్య ఉన్న రస్తాను వారు స్వాధీనం చేసుకున్నారని రస్తాలో బండ రాళ్లను వేశారని రస్తా అంతా మాదే మీది ఏమీ లేదని అంతే కాకుండా రస్తాలో వేసిన బండ రాళ్లను తీయమని అడిగితే ఎల్లయ్య తదితరులు మమ్మల్ని బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని వారు వాపోయారు.ఈ రస్తా పంచాయితీ కోర్టులో ఉండగా కారు ఏ విధంగా పనులు చేస్తారని మండిపడ్డారు.అంతే కాకుండా గతంలో కోర్టు కమిషనర్ మరియు లాయర్లు ఈ స్థలాన్ని పరిశీలించారని అన్నారు.కావునా రస్తాలో వేసిన బండరాళ్లను తొలగించాలని పోలీసులు మరియు అధికారులను వారు కోరుతున్నారు.