టాటా మోటార్స్ అనుబంధ సంస్థలు టీఎంపీవీ, టీపీఈఎం భాగస్వామ్యం
1 min readపల్లెవెలుగు వెబ్ ముంబై : భారతదేశ ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు అయిన టాటా మోటార్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థలు – టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ), టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (టీపీఈఎం) నేడు భారతదేశ అతిపెద్ద సహకార బ్యాంకులలో ఒకటైన సారస్వత్ బ్యాంక్‌తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ భాగస్వామ్యం ద్వారా సరస్వత్ బ్యాంక్ టాటా మోటార్స్ నుండి ఇంటర్నల్ కంబుషన్ ఇంజిన్ (ఐసీఈ), ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ కోసం అనుకూలీకరించిన ఆటో రిటైల్ ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందిస్తుంది.టాటా మోటార్స్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో ప్రసిద్ధ ప్యాసింజర్ వాహనాల (ఐసీఈ + ఈవీ) యాక్సెసిబిలిటీని పెంచడానికి ఈ భాగ స్వామ్యం రూపొందించబడింది. ఇది కస్టమర్లకు పోటీ వడ్డీ రేట్లను అందించడం ద్వారా, స్థోమత, సౌలభ్యాన్ని పెంచడం ద్వారా వారి మొత్తం కొనుగోలు అనుభవాన్ని పెంచుతుంది. టాటా మోటార్స్, సారస్వత్ బ్యాంక్ సీనియర్ నాయకత్వ సభ్యుల సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ భాగస్వామ్యం గురించి టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మరియు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ధీమాన్ గుప్తా వ్యాఖ్యానిస్తూ, ‘‘కస్టమర్ కేంద్రీకృతం వైపు దృష్టి సారించిన బ్రాండ్ గా, వినియోగదారుల సౌలభ్యం, స్థోమతను పెంచే అవకాశాలను మేం ఎల్లప్పుడూ అన్వేషిస్తున్నాం. సారస్వత్ బ్యాంక్‌తో ఈ భాగ స్వామ్యం పోటీ రేట్లతో అనుకూలీకరించిన ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించే లక్ష్యంతో సరైన దిశలో ఒక అడుగు అని మేం గట్టి గా విశ్వసిస్తున్నాం. ఈ అనుబంధం టాటా మోటార్స్ ఐసీఈ, ఈవీల కొనుగోలును మరింత అందుబాటులోకి తీసుకు రావడానికి మా నిబద్ధతను బలోపేతం చేస్తుంది.మా కస్టమర్లకు సజావైన, ప్రతిఫలదాయకమైన అనుభవాన్ని అందిస్తుంది’’ అని అన్నారు.ఈ సందర్భంగా సారస్వత్ బ్యాంక్ చైర్మన్ గౌతమ్ ఠాకూర్ మాట్లాడుతూ, ‘‘వాహన కొనుగోలును సులభతరం మరియు సరళంగా మార్చే లక్ష్యంతో మా కస్టమర్లకు అనుకూలీకరించిన మరియు పోటీతత్వ కార్ ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించడానికి టాటా మోటార్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు సంతోషంగా ఉంది. ఈ ఒప్పందంతో, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు మా కస్టమర్లకు విస్తృత ఎంపికలను అందించాలని మేం ఆశిస్తున్నాం” అని అన్నారు.