తల్లికి వందనం పథకం ఈ విద్యా సంవత్సరం బేషరతుగా అమలు చేయాలి
1 min readకర్నూలు జిల్లా ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి రాష్ట్ర ప్రధానకార్యదర్శి కటికె గౌతమ్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ లో నిర్వహించిన పత్రికావిలకరుల సమావేశంలో కర్నూలుజిల్లా ఐక్యవిద్యార్థి సంఘాలు రాష్ట్రంలో నెలకొన్న విద్యార్థి సమస్యలపై ఉద్యమానికి శ్రీకారం చుడుతూ సమావేశానికి హాజరయ్యారు.ఈకార్యక్రమాన్ని ఉద్ధ్యేశించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటికె గౌతమ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఆటకెక్కించి పూర్తిగా మధ్యాంద్ర ప్రదేశ్ గా మార్చిన ఘనత కూటమిప్రభుత్వానిదే అని వాపోయారు.ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మ్యానిఫెస్టోలోని ఏ ఒక్క పథకం ఇంతవరకు అమలు చేయకపోగా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందే కాక చివరకు భావిభారత పౌరులైన విద్యార్థులకు వారి తల్లి తండ్రులకు ఇచ్చిన తల్లికి వందనం హామీని విద్యాసంవత్సరం పూర్తి కావస్తున్నా అమలుచేయలేకపోవడం హేయమైన చర్య అని తెలియజేసారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 3580 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని,కూటమిప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం 77 జీవో ని రద్దు చేయాలని అన్నారు,అలాగే ప్రతీ సంవత్సరం జనవరి మొదటి వారంలోగా ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని ప్రభుత్వాన్నీ కటికె గౌతమ్ నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమలు చేసిన జీవో నంబర్ 85ను కొనసాగించి ఇంగ్లీష్ మీడియం విద్యను పేద బడుగు బలహీన వర్గాలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందాలని ,తల్లికి వందనం పథకం ఈ విద్యాసంవత్సరం లొనే ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే అమలుపరచాలని ప్రభుత్వానికి ఐక్య విద్యార్థి సంఘాల తరపున డిమాండ్ ను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా నాయకులు రామకృష్ణ,ఎన్ ఎస్ యూ ఐ జిల్లా కార్యదర్శి ధోని బాలరాజు,నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్ నాయుడు,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా నాయకులు శ్రీకాంత్ రెడ్డి ,కోట్ల మధు కుమార్,తిరుమలేష్ తది తరులు పాల్గొన్నారు.