PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీబీ రోగికి పెద్దపేగు క్యాన్స‌ర్‌!

1 min read

అత్యంత స‌మ‌స్యాత్మ‌క‌మైన ప‌రిస్థితి

కిమ్స్ స‌వీరా ఆస్పత్రిలో విజ‌య‌వంతంగా చికిత్స‌

పల్లెవెలుగు వెబ్ అనంతపురం: అనంత‌పురం జిల్లా బుక్కప‌ట్నం గ్రామానికి చెందిన చిన్న కుళాయ‌ప్ప అనే వ్యక్తి గ‌త రెండు నెల‌లుగా తీవ్ర‌మైన క‌డుపునొప్పి, ఆక‌లి లేక‌పోవ‌డం, బ‌రువు త‌గ్గడం లాంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. బెంగ‌ళూరు తీసుకెళ్లగా, పెద్ద పేగుకు క్యాన్సర్ ఉంద‌ని, దాంతోపాటు క్షయ (టీబీ) కూడా ఉంద‌ని తేలింది. దాంతో చికిత్స కోసం అనంత‌పురంలోని కిమ్స్ స‌వీరా ఆస్పత్రికి వ‌చ్చారు. ఇక్కడ అత‌డికి చికిత్స చేసిన క‌న్సల్టెంట్ స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రోఎంట‌రాల‌జిస్టు డాక్టర్ ఎన్. మ‌హ్మద్ షాహిద్ ఇందుకు సంబంధించిన వివ‌రాలు తెలిపారు. “కుళ్లాయ‌ప్పకు పెద్దపేగుల క్యాన్సర్ ఉండ‌డంతో శ‌స్త్రచికిత్స చేసి తొల‌గించాలి. కానీ, అత‌డికి టీబీ కూడా ఉండ‌డం వ‌ల్ల ముందుగా ప‌ల్మ‌నాల‌జిస్టు అభిప్రాయం తీసుకున్నాం. శ‌స్త్రచికిత్స చేసిన త‌ర్వాత ఏటీటీ మందుల‌తో చికిత్స చేయాల‌ని ఆయ‌న సూచించారు. దాంతో ముందుగా రోగికి ఎడ‌మ‌వైపు హెమొకోలెక్టమీ అనే శ‌స్త్రచికిత్స చేశాం. ఇందులో పెద్ద‌పేగులో క్యాన్సర్ ప్ర‌భావిత‌మైన భాగాన్ని పూర్తిగా తొల‌గించాం. మిగిలిన భాగాన్ని క‌లిపి కుట్టేశాం. రోగికి టీబీ ఉండ‌డంతో శ‌స్త్రచికిత్స చేసిన త‌ర్వాత కొద్దిరోజులు ఐసొలేష‌న్ గ‌దిలో ఉంచాం. శ‌స్త్రచికిత్స చేసిన ఐదు రోజుల త‌ర్వాత ఎలాంటి స‌మ‌స్య‌లు లేక‌పోవ‌డంతో ఏటీటీ మందులు వాడ‌డం మొద‌లుపెట్టాం. కొలోరెక్టల్ క్యాన్సర్ అనేది పెద్దపేగుల‌కు సంబంధించి వ‌చ్చే క్యాన్సర్ల‌లో చాలా త‌ర‌చుగా వ‌స్తుంది. స్ప్లీనిక్ ఫ్లెక్సర్ క్యాన్సర్‌నే కొలోన్ క్యాన్సర్ అటారు. ఇది అన్నిర‌కాల కొలోన్ క్యాన్సర్లలో 2-8% మాత్రమే ఉంటుంది. స్ప్లీనిక్ ఫ్లెక్సర్ క్యాన్సర్‌కు అధిక మూల‌క‌ణ రుగ్మత ప్రధాన కార‌ణం. దీని నిర్ధార‌ణ ఆల‌స్యం అయితే చికిత్స కూడా కొంత క‌ష్టం అవుతుంది. అయితే, ఇత‌ర కొలోన్ క్యాన్స‌ర్ల‌తో పోలిస్తే ఇందులో కూడా జీవ‌న‌ప్రమాణంలో పెద్దగా మార్పు ఉండ‌ద‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. దీనికి శ‌స్త్రచికిత్స చేసేట‌ప్పుడు ప్రభావిత‌మైన లింఫ్ నోడ్లు అన్నింటినీ కూడా తొల‌గిస్తే ఫ‌లితాలు మెరుగ్గా ఉంటాయి” అని డాక్టర్ మ‌హ్మద్ షాహిద్ వివ‌రించారు.

About Author